Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఘనంగా ఎన్‌టిఆర్ వర్థంతి వేడుకలు

NTR

మంచిర్యాలఅర్బన్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు 21వ వర్థంతి వేడుకలను టిడిపి పార్టీ మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు బోడ జనార్థన్,రాష్ట్ర కార్యదర్శి పొగా కు జయరామ్‌చందర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయం వద్ద ఎన్‌టిఆర్ విగ్రహా నికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ ఎన్‌టిఆర్ స్థాపించడాని వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పె ట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను ఇప్పటికి కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు నాయకులు అమలు చేస్తూ తామే ప్రవేశ పెట్టినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు వారి గుండెల్లో స్వర్గీయ ఎన్‌టిఆర్ ఎప్పటికి నిలిచే ఉంటాడన్నారు. రాజకీ యాలకు అర్థం చెప్పిన ఘనుడని రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిన గొ ప్ప మహానుభావుడని కీర్తించారు.

ఆయన ఆశయాలను టిడిపి నాయకులు ముందుకు తీసుకెళ్తున్నారని, తె లంగాణలో ప్రజలు టిడిపికి బ్రహ్మరథం పడుతారని వారు ఆశాభావం వ్య క్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గోపతి మల్లేష్, జిల్లా ఉ పాధ్యక్షుడు సింగతి మురళి, ప్రచార కార్యదర్శి మేరడి కొండ శ్రీనివాస్, ప ట్టణాధ్యక్షుడు కోటూరి కిరణ్‌కుమార్ , కార్యదర్శులు పుట్టమధూకర్, ఓ లం రాజ్‌కుమార్,అలుపట్ల రాజారాం,గౌసోద్దీన్,కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

comments