Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఎన్‌టిఆర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

NTR Movie First Look Release on Sunday

హైదరాబాద్ : బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఎన్‌టిఆర్ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఎన్‌టిఆర్ జీవితాధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సినిమా యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో ఎన్‌టిఆర్ నటించిన పలు చిత్రాల్లోని పాత్రలతో పాటు అవే పాత్రల్లో బాలకృష్ణను చూపించారు. బాలకృష్ణకు ఎన్‌టిఆర్ మీసాలు దిద్దుతున్నట్టు చూపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారాహి చలన చిత్రం, బాలకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. నటీనటుల కోసం సినిమా యూనిట్ ఆడిషన్స్ నిర్వహిస్తోంది.

NTR Movie First Look Release on Sunday

Comments

comments