Home సినిమా కల్యాణ్‌రామ్ నిర్మాతగా ఎన్‌టిఆర్ మూవీ

కల్యాణ్‌రామ్ నిర్మాతగా ఎన్‌టిఆర్ మూవీ

cinema4తాజాగా ఎన్‌టిఆర్ చేస్తున్న సినిమా ‘నాన్నకు ప్రేమతో’. ఇప్పటికే లండన్‌లో ఎక్కువ భాగం షూటింగ్ చేసిన సినిమా టీం దసరా తర్వాత ఫైనల్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనుంది. స్పెయిన్ వెళ్లేలోపు ఎన్‌టిఆర్ తన తదుపరి సినిమా లను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే తన తదుపరి సినిమా కొరటాల శివ డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఉంటుందని ఖరారైంది. ఈ సినిమాని దసరా సందర్భంగా ప్రారంభించి డిసెంబర్ నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు ఎన్‌టిఆర్. ఈ సినిమా తర్వాత చేసే చిత్రానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ముహూర్తాన్ని కూడా నిర్ణయించాడని తాజా సమాచారం. వక్కంతం వంశీని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ చేయబోయే ఈ సినిమాలో నటిం చడానికి ఎన్‌టిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాని కల్యాణ్‌రామ్… ఎన్‌టిఆర్ ఆర్ట్ బ్యానర్‌పై నిర్మించనున్నాడు. ఎన్‌టిఆర్-వక్కంతం వంశీల సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అధికారికంగా ప్రారంభించనున్నారు.