Home తాజా వార్తలు చరణ్‌తో బంధం ఎప్పుడో ఏర్పడింది: ఎన్టీఆర్

చరణ్‌తో బంధం ఎప్పుడో ఏర్పడింది: ఎన్టీఆర్

 

హైదరాబాద్‌:నాకు రామ్‌ చరణ్‌తో బంధం ఎప్పుడో ఏర్పడిందని.. ఈ సినిమాతో అది వేరే లెవల్‌కి వెళ్లిపోయిందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా ఎంతో ప్రాతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను గురువారం చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు ఇది జక్కన్నతో నాలుగో చిత్రం. నా కెరీర్‌లో ఈ సినిమా ల్యాండ్‌మార్క్‌గా మిగిలిపోతుంది. ఎందుకంటే జక్కన్నతోపాటు చరణ్‌తో కలిసి పనిచేయబోతున్నాను. మా ఇద్దరి స్నేహం ఈ సినిమాతో మొదలవ్వలేదు. నాకు తెలిసిన మంచి మిత్రుడు. నా కష్ట సుఖాలు పంచుకునే మిత్రుడు చరణ్‌. ఈ చిత్రంలో మేమిద్దరం కలిసి పనిచేయడంతో అది వేరే లెవల్‌కి వెళ్లిపోయింది. మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే స్నేహితులుగా మిగిలిపోవాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. ఎందుకంటే, మంచి బంధాలు వచ్చినప్పుడే దిష్టి తగులుతుంది అని మా అమ్మ చెబుతూ ఉంటుంది. మా ఇద్దరికీ ఆ దిష్టి తగలకూడదు. అల్లూరి, భీం గురించి తెలిసిన గీత ఒకటి ఉంది. ఇప్పుడు వారిద్దరూ మనకు తెలీని గీత గురించి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చూస్తారు. ఈ సినిమా నాకు, చరణ్‌కు నటులుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ సినిమా ప్రారంభించడానికి ముందు మేం చేసిన వర్క్‌ షాప్స్‌, శిక్షణ చాలా అద్భుతంగా ఉంది. నటులుగా ఈ చిత్రంలో మేం పాల్గొనడం మా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినందుకు జక్కన్నకు ధన్యవాదాలు. మా తరంలో ఈ సినిమా రాబోతోందని చాలా సంతోషంగా ఉందని” తారక్ అన్నారు.

NTR Speaks about #RRR at Press Meet