Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

రెండు షేడ్స్‌లో

ntr

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరవింద సమేత’ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తారక్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘జై లవకుశ’ చిత్రం విడుదలై ఎనిమిది నెలలు దాటింది. దీంతో అతని కొత్త చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ మొదలైన తర్వాత వేగంగా కొనసాగుతోంది. సిక్స్‌ప్యాక్‌తో ఎన్టీఆర్ దర్శనమిచ్చిన ఫస్ట్‌లుక్‌కు అనూహ్య స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రంలో యంగ్ టైగర్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందట. ఫస్టాఫ్‌లో సిద్ధార్థ్ గౌతమ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో కూల్‌గా కనిపిస్తే… సెకండాఫ్‌లో వీర రాఘవగా మరో కోణం చూపిస్తాడట. కీలకమైన పాత్ర ఇదే అని టైటిల్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే వీర రాఘవ ఉనికిని దాచుకోవడం కోసం గౌతమ్‌గా మారతాడా లేదా గౌతమ్ వీర రాఘవగా మారాల్సిన పరిస్థితి వస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తారక్  ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేసి చాలా కాలమైంది. ఆది, సింహాద్రి, సాంబ తర్వాత మళ్లీ ఆ జోనర్ జోలికి వెళ్లలేదు. కానీ మాస్ ప్రేక్షకులకు బాగా చేరువ చేసింది మాత్రం ఆ సినిమాలే. మళ్లీ ఆ తరహా సినిమాలో ఎన్టీఆర్‌ని చూడాలన్న అభిమానుల కోరిక ఈ చిత్రంతో  నెరవేరబోతోంది.

Comments

comments