Home అంతర్జాతీయ వార్తలు అణుబాంబు పేల్చింది ఇక్కడే…?

అణుబాంబు పేల్చింది ఇక్కడే…?

NUCLEARసియోల్ : ఉత్తరకొరియా అణుపరీక్షలు జరిపిన ప్రదేశంలో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అమెరికాకు చెందిన ఓ నిఘా ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రాలను విశ్లేషిస్తే అవగతమవుతోంది. మరో అణుపరీక్షకు ఏర్పట్లు చేయడంగానీ, పాత అణుపరీక్షకు సంబంధించిన నమూనాల సేకరణగానీ జరుగుతోందని అమెరికా అనుమానిస్తోంది. పుంగ్యరీ అణుపరీక్ష కేంద్రంలోని మూడు టన్నెల్స్‌లో ఏవో కార్యకలాపాలు జరుగుతున్నట్లు జాన్స్ హవ్‌కిన్స్ విశ్వవిద్యాలయంలో ది32నార్త్ గ్రూప్ పరిశోధక బృందం తెలిపింది. సెప్టెంబరు 9న నిర్వహించిన అణుపరీక్షకు సంబంధించిన నమూనాలను సేకరించే అవకాశమే ఎక్కువగా ఉందని ఇందులో పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరకొరియా అణుకార్యకలాపాలను పెంచుతుందని భావిస్తున్నారు.