Home అంతర్జాతీయ వార్తలు అణుక్షిపణుల ప్రయోగం సక్సెస్

అణుక్షిపణుల ప్రయోగం సక్సెస్

KIM-JONGసియోల్ : తాము జరిపిన రెండు మధ్యంతర మసుదాన్ అణుక్షిపణుల పరీక్షలు విజయవంతమయ్యాయని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్షిపణులతో ఫసిపిక్‌లోని అమెరికా స్థావరాలను ఢీకొట్టగలమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు జరిపిన ఐదో పరీక్ష విఫలం కావడంతో కిమ్ జాంగ్ ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఆరోసారి మసుదాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలు జరినట్లుగానీ, టార్గెట్‌ను ఛేదించినట్లుగానీ పరీక్ష రోజు ఉత్తరకొరియా ప్రకటించలేదు. పరీక్ష పూర్తయిన మరుసటి రోజు మాత్రం అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం జరిపిన అణుక్షిపణుల పరీక్షలు గొప్ప కార్యక్రమాలని ఆయన ప్రశంసించాడు. అణ్వాయుధాలతో కూడా తాము దాడి చేయగలమని మరోసారి వీటి ద్వారా నిరూపితమైందని ఆయన తెలిపారు. 2,500 కిలోమీటర్ల నుంచి 4,000 కిలో మీటర్ల వ్యవధిలో ఎక్కడి నుంచైనా దాడి చేయగలమని, అమెరికాను సైతం ఢీకొట్టగలమని ఆయన స్పష్టం చేశారు.