Search
Sunday 18 November 2018
  • :
  • :

భారత్‌తో అణు యుద్ధం తప్పకపోవచ్చు : పాక్

pak

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. దక్షిణాసియాలో సుస్థిరత చాలా సున్నితంగా ఉన్నదని, ఏ సమయంలో అయినా అణు యుద్ధం తప్పకపోవచ్చు అని ఆ దేశ భద్రతా సలహాదారు నజీర్ ఖాన్ జన్‌జువా అన్నారు. ఇండియాలో ప్రమాదకర ఆయుధాలు పెరిగిపోతున్నాయని, ఇది పాకిస్థాన్‌కు ముప్పేనని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌ను అడ్డుకోవడానికి ఇండియాతో కలిసి అమెరికా కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. జాతీయ భద్రతకు సంబంధించి నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడుతూ నజీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో అమెరికా బలగాలను మోహరించడం ఉగ్రవాదానికి ఊతమిచ్చిందని నజీర్ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్‌లు మళ్లీ చెలరేగుతుంటే అమెరికా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్థాన్‌పైకి వాటిని నెడుతున్నదని విమర్శించారు. దక్షిణాసియాలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించడానికే ఇండియాతో కలిసి సీపీఈసీకి వ్యతిరేకంగా అమెరికా కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఆఫ్ఘనిస్థాన్ విషయంలోనూ పాకిస్థాన్‌ను కాదని అమెరికా ఇండియాకు ప్రాధాన్యమివ్వడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

Comments

comments