Home కామారెడ్డి ప్రభుత్వ హాస్టళ్లపై అనాసక్తి

ప్రభుత్వ హాస్టళ్లపై అనాసక్తి

Number of students in government hustles will be reduced

మన తెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ హస్టల్లలో క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. హాస్టళ్లలో ప్రవేశాలకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థుల చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నా ప్రవేశాల సంఖ్య తగ్గిపోతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2016 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం 30 శాతం ప్రవేశాలు తగ్గిపోయాయి. హాస్టళ్లలో ప్రవేశం తగ్గడంతో సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యారులు హాస్టళ్లకు రాకుండా రెసిడెన్షియల్ స్కూళ్లలో చదవడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో ప్రవేశాలు తగ్గి ఆదరణ తగ్గడంతో వార్డెన్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రవేశాలకు ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్న క్షేత్ర స్థాయిలో ప్రవేశాలు జరగడం లేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో 2,093 మంది విద్యార్థులు చదువుతున్నారు. బిసి వెల్ఫేర్ హాస్టళ్లలో 1,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. గిరిజన హాస్టళ్లలో భారీ సంఖ్యలో ప్రవేశాలు తగ్గిపోయాయి.