Home లైఫ్ స్టైల్ మెనోపాజ్‌లో తీసుకోవాల్సిన పోషకాలు

మెనోపాజ్‌లో తీసుకోవాల్సిన పోషకాలు

Menopause

మహిళలకు మలి దశలో ఎదురయ్యే రకరకాల ఇబ్బందులను సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం ద్వారా పరిష్కరించుకోవచ్చు. చిన్న వయసులోనే మంచి అలవాట్లు ఉండటం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోవచ్చు. ముందునుంచీ క్రమశిక్షణతో కూడిన జీవనముంటే మెనోపాజ్ తాలుకు లక్షణాలు ఆ వయసులో పెద్దగా వేధించవు. హార్మోన్ల చికిత్స కూడా అవసరం ఉండదని అనేక పరిశోధనలు వెల్లడించాయి. మెనోపాజ్ వయసులో ఆహారపు అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పులను చూద్దాం…
-* బియ్యం, గోధుమల్లాంటి తృణధాన్యాలు పాలిష్ చేసినవి తీసుకోవద్దు. రాగులు, సజ్జలు, జొన్న, మొక్కజొన్న, ఓట్స్ వంధ్ట రకరకాల ధాన్యాలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. మార్కెట్‌లో మల్టీగ్రెయిన్ పిండి కూడా దొరుకుతుంది.
-* ఈ వయసులో మాంసాహారం కన్నా శాకాహారం తీసుకుంటే మేలు. వారికి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా తక్కువేనని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
-* కూరగాయల్లో విటమిన్లు, ఖనిజ లవణాలతోపాటు పీచు పదార్థాలు ఉంటాయి. వాటిని పుష్కలంగా తీసుకోవాలి. ఒకే రకం కాకుండా మార్చిమార్చి తీసుకోవాలి.
-* చిక్కుడు గింజలు, బీన్స్, రాజ్‌మా, సోయా వంటి గింజలు వారంలో కనీసం రెండు సార్లయినా తీసుకోవాలి.
-* శీతల పానీయాలు, నిల్వ ఉంచిన పదార్థాలు, ఎక్కువ కెలరీలున్నవి, జంక్‌ఫుడ్స్ పూర్తిగా మానేయాలి.
-* ఆహారాన్ని క్రమబద్దంగా, తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌ను చాలా మంది మహిళలు తీసుకోరు. అలా చేయకుండా ఉదయం ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలి.
* వంటనూనెల వాడకంలోనూ జాగ్రత్తలు పాటించాలి. రెండు మూడు రకాల నూనెలు వాడాలి. సోయ, ఆలివ్, రైస్ బ్రౌన్, వేరుశనగ, పొద్దు తిరుగుడు పువ్వుల నూనెలను వాడాలి.