Home ఆదిలాబాద్ పౌష్టికాహార లోపం

పౌష్టికాహార లోపం

బక్క చిక్కుతున్న ‘బాల్యం’
తక్కువ బరువుతో పిల్లలు జననం
పోషకాహార లోపమే శాపం
గ్రామీణ ప్రాంత గర్భిణుల్లో సమస్య

పౌష్టికాహారం తీసుకోకపోతే అనర్థాలు
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోకపోతే భవిష్యత్‌లో అనర్ధాలకు దారితీస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఆహారం తీసుకోవడం లేదు. పిండం ఎదిగే దశలో మంచి ఆహారం తీసుకోవాలి. పుట్టిన పిల్లలకు తల్లి పాలు ఇవ్వాలి. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించాలి.
-డాక్టర్ రమాదేవి, స్త్రీవైద్య నిపుణురాలు

గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందక తల్లి, పుట్టబోయే పిల్లలపై ప్రభావం చూపుతోంది. పోషకాహారం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. ఓ వైపు పేదరికం, మరో వైపు ఆర్థిక సమస్యలు తోడవడంతో పోషకాలు కలిగిన ఆహారాన్ని తినలేకపోతున్నారు. ప్రభుత్వం ఏటా రూ. కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. గర్బిణులు, పుట్టిన పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన కేంద్రాల నిర్వహణ అధ్వానంగా ఉంది. పర్యవేక్షణ లేమి కొట్టొచినట్టు కనిపిస్తోంది. మహిళా. శిశు సంక్షేమ, వైద్యశాఖల మధ్య సమన్వయం లోపిస్తోంది. దీంతో నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ బరువుతో పుట్టి అనారోగ్య పాలవుతున్నారు.

-మన తెలంగాణ/నిజామాబాద్ సిటీ

సమతుల ఆహారం అవసరం
pregnant1గర్భిణులకు రోజుకు 3,000 కేలరీల శక్తి అవసరం. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు కనీసం 1500 కేలరీల శక్తి మాత్రమే సమకూరుతోంది. కుటుంబ నేపథ్యం ఆర్థిక సమస్యలు, అవగాహన లేమి తదితర కారణాలతో పండటి బిడ్డను కనాల్సిన వారికి అనేక సమస్యలు చుట్టుముట్టి అనర్ధాలకు దారి తీస్తున్నాయి. సమతుల ఆహారం అందడం లేదు. సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, మినరల్స్ అందేలా ఆహార ప్రణాళిక అవసరం. గర్భం ధరించిన మహిళ ‘డీ’ విటమిన్ తీసుకోవాలి. గర్భంలో పుట్టబోయే బిడ్డకు వెననముక సమస్యలు రాకుండా దోహద పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్నారుల పరిస్థితి
జిల్లాలో 0-6 ఏళ్లలోపు పిల్లలు 3 లక్షల మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2.05 లక్షలు, పట్టణాల్లో 90 వేల మంది ఉన్నారు. మూడేళ్లు నిండిన 50 వేల మంది చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్తున్నారు. రోజు కేంద్రాలకు వెళ్లి రావడం తప్పా పిల్లల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కేంద్రాల నిర్వహకులు మొక్కుబడిగా పని కానిస్తున్నారు. పిల్లలకు అత్తెసరు పౌష్టికాహారంతో సరిపెడుతున్నారు. గర్బిణులు పౌష్టికాహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో శివు మరణాలకు దారి తీస్తోంది.
జిల్లాలో పరిస్థితి
జిల్లాలో 2, 432 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 10 ప్రాజెక్టుల పరిధిలో ఈ కేంద్రాలు పని చేస్తున్నాయి. 5 కేంద్రాల పరిధిలో అమృతహస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అభాసుసాలవుతోంది. పిల్లలకు పౌష్టికాహారం దేవుడెరుగు, పలువురికి ఫలహారమవుతోంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే రూ. కోట్లు నిధులు వృథా అవుతున్నాయి. అడిగే నాథుడే లేక.. అంగన్‌వాడీల నిర్వహణను గాలి కొదిలేశారు. శిశు సంక్షేమ శాఖ ఉదాసీన వైఖరి ఆశ. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు, 1 నగర పాలక, 3 పురపాలక సంఘాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 25,51,335 మంది జనాభా ఉండగా, మహిళలు 13,00,694 మంది పురుషులు 12,50,541 మంది ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 5,88,372 మంది ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 23,45,865 ఉండగా ప్రస్తుతం 25.51 లక్షలకు చేరింది.
పౌష్టికాహార లోపమే కారణం
పిల్లలకు పౌష్టికాహారం అందించేలా క్షేత్రస్థాయిలో చొరవ చూపడం ఐసీడీఎస్ బాధ్యత. ప్రస్తుతం జిల్లాలో 48 శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. గర్బిణి దశలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సమస్యకు దారితీస్తోంది. రెండేళ్లలోపు పిల్లల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. వయసుకు తగిన బరువు ఉండటం లేదు. ఒకటో తరగతి విద్యార్థి ఉండాల్సిన బరువు 15 -18 కి.గ్రా, ప్రస్తుతం 10-12 కి.గ్రా మాత్రమే ఉంటున్నారు. రెండేళ్లలోపు వయసు కలిగిన పిల్లల్లో పౌష్టికాహార లోపంతో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. ఎదుగుదల నిలుస్తుంది. ఇతర వ్యాధులు త్వరగా దరిచేరేందుకు కారణమవుతుంది.
ఇవి అందించాలి
జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో అమృత హస్తం పథకం అమలయ్యే కేంద్రాల్లో గర్భిణులకు రోజూ గుడ్లు ఇవ్వాల్సి ఉంది. 200 ఎంఎల్ పాటు 125 గ్రాముల బియ్యం, పిల్లలకు 65 గ్రాముల అందించాలి. పర్యవేక్షణ లేమి కారణంగా శిశు సంక్షేమం గాలిలో దీపంలో మారింది.