Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నట్స్‌తో గుండెపోటుకు చెక్

nuts

ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే అదే తనకు ఒక విలువైన ఆస్తిలాంటిది .మనలో చాలా మంది దానిని ఒప్పుకుంటాం. మంచి ఆరోగ్యం లేకుంటే పరిపూర్ణమైన సంతోషం ఉండదు. కొన్ని చిన్న చిన్న రోగాలు మాత్రం కొంత సమయంలో తగ్గిపోతాయి, అవి మీ జీవితంలోని రోజువారి కార్యకలపాలకు భంగం కలిగించవు . కాని గుండె , ఊపిరితిత్తులు, కాలేయం, మూత్ర పిండాలు, మెదడు శరీరంలో ముఖ్యమైన అవయవాలు . ఏ ఒక్కటి పాడైనా లేక బలహీనంగా ఉన్నా , అవి గుండె పోటుకు దారి తీస్తాయి . మీరు చక్కర వ్యాధితో బాధ పడుతుంటే, ఎంతో ఇష్టమైన మిఠాయిలు ఉన్నా వదిలిపెట్టేయాల్సిందే. ఆరోగ్య విషయంలో ఆహారం చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మనందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో కొందరు పరిశోధకులు చేసిన పరిశోధన ప్రకారం నట్స్(పప్పులు) రోజు తింటే గుండెపోటు రాదని తెలిసింది.
గుండెపోటుకి పప్పుగింజలకి మధ్య ఉన్న సంబంధం , ఒక్కో రకం పప్పు గింజల్లో ఒక్కో రకమైన ఆరోగ్యనికి సంబంధించిన ప్రయోజనాలు ఉంటాయి .వాటిలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలకు అన్ని గింజల్లో సాధారణమైనవి. వేరుశనగ పప్పులు , బాదం, జీడి పప్పులు , పిస్తా, అక్రోట్లను పప్పుల్లో ముఖ్యమైనవి. బాదం పప్పులు కండలు పెరగడంలో సహయపడితే,పిస్తా పప్పులు బరువు పెరగడంలో తోడ్పడుతుంది .కొని రకాలైన పప్పులని , వంటకాల్లో రుచికి వాడతారు .అలాగే వాటిని పచ్చిగా వేయించుకుని కూడా తినొచ్చు. పిస్తా, బాదం పప్పులు రెండూ శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచి రోగాలకు దూరంగా ఉంచుతాయి. గుండె పోటు చాల ప్రమాదకరమైనది. గుండెకి రక్తం, ఆక్సిజన్ లోపించి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది . చాలా సందర్భాల్లో గుండెపోటు హఠాత్తుగా మరణానికి దారితీస్తుంది. సాధారణంగా కొవ్వు లేక కొలెస్ట్రాల్ ఈ రెండూ ధమనులని మూసేసి ఆక్సిజన్ ఉన్న రక్తం గుండెకి చేరకుండా అడ్డుపడుతుంది . ఇటీవల అమెరికన్ కార్డియోలజి యూనివర్శిటీ పరిశోధన ప్రకారం వారు చెప్పేదేమిటంటే ప్రతి రోజూ పప్పు గింజలు లేదా నట్లను తింటే గుండె పోటు రాదని చెబుతున్నారు. ఆ అధ్యయనం చెప్పేదేమిటంటే , పప్పు గింజల్లో ఉండే ఒమెగా 3- ఫ్యాటీ ఆసిడ్స్ , తమ సహజ సామర్ధంతో కొలెస్ట్రాల్‌ను తగ్గించి ,రక్తనాళలలో ఫలకాల్లో పేరుకున్న కొవ్వును తగ్గించి ,గుండెకి వెళ్ళే ఆక్సిజన్ నిండిన రక్త ప్రసరణాన్ని సులభపరుస్తుంది .ఈ పై చర్యలు తీసుకుంటే గుండె పోటు, ఇతర గుండె కి సంబంధించిన రోగాలని నివారించే సహాయం చేస్తుంది.
కొంచెం ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యం కంటే అదేం పెద్ద ముఖ్యమైనది కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ రోజువారీ ఆహారంలో నట్స్‌ను చేర్చుకోవాలిని ఆహారనిపుణులు చెబుతున్నారు.

Comments

comments