Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఫేస్‌బుక్‌లో ఒబామా

Obama-Facebookవాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాకు తొలి నల్ల జాతి అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ఫేస్‌బుక్ ఖాతాని సోమవారం తెరిచారు. తన తొలి పోస్ట్‌గా వైట్ హౌస్ వాతావరణం గురించి ఒక వీడియోని ఒబామా అప్‌లోడ్ చేశారు. ఒబామా ఫేస్‌బుక్ ఖాతా తెరిచిన అనతి కాలంలోనే ఆయన పేజీకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. వీడియోతో పాటు తన తొలిసారి మరియు రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ఫొటోలు. తన పెళ్లి నాటి ఫొటో, మరియు చిన్నారి ఒబామా ఫొటోని కూడా తన పేజీలో ఉంచారు. ఒబామా ఫేస్‌బుక్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉందని తనని ఫేస్‌బుక్‌లోకి స్వాగతిస్తున్నట్లు ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ కామెంట్ చేశారు.

Comments

comments