Home అంతర్జాతీయ వార్తలు కన్నీరు పెట్టిన ఒబామా

కన్నీరు పెట్టిన ఒబామా

OBAMAవాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీరు పెట్టారు. దేశంలో పెరిగిపోతున్న గన్‌కల్చర్‌పై ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై ఏడ్చేశారు. గన్ కల్చర్ వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గన్‌కల్చర్ కారణంగా దేశంలో ఎంతో మంది చిన్నారులు బలయ్యారని వాపోయారు. మూడేళ్ల క్రితం కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లో తుపాకీ చేతబట్టి ఓ పాఠశాలలోకి చొరబడిన దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో 20 మంది చిన్నారులు చనిపోయారు. ఆ ఘటనను మననం చేసుకున్న సందర్భంగా ఒబామా బావోద్వేగానికి లోనయ్యారు. గన్‌కల్చర్‌కు చెక్ పెట్టేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఒబామా స్పష్టం చేశారు.