Home అంతర్జాతీయ వార్తలు పారిస్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళి తెలిపిన ఒబామా

పారిస్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళి తెలిపిన ఒబామా

OBAMA-HOLLANDEపారిస్: నగరంలోని బటక్లాన్ థియేటర్ వద్ద అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలాండ్‌తో కలిసి ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు. నవంబర్ 13న ఐసిస్ తీవ్రవాదులు పారిస్ నగరంపై బాంబులు, కాల్పులతో విరుచుకు పడిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో 130 మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. వీరిలో దాదాపు 80 మంది వరకు బటక్లాన్ వద్ద జరిగి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒబామా ఈ ప్రాంతాన్ని సందర్శించి పుష్పగుచ్ఛాలతో నివాళులు తెలిపారు.