Home అంతర్జాతీయ వార్తలు ఒబామా కన్నీళ్లు నిజమైనవే : డోనాల్డ్ ట్రంప్

ఒబామా కన్నీళ్లు నిజమైనవే : డోనాల్డ్ ట్రంప్

trumphవాషింగ్టన్: అమెరికాలో తుపాకీ సంస్కృతిని నియంత్రించేందుకు ఒబామా తీసుకుంటున్న చర్యలను తాను అంగీకరించబోనని, కాకపోతే ఆయన భావోద్వేగంతో కార్చిన కన్నీళ్లు మాత్రం నిజమైనవేనని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ముందువరుసలో ఉన్న ట్రంప్ బుధవారం ఫాక్స్ న్యూస్ టివికి ఈ విష యం చెప్పారు. 2012లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఫస్ట్ గ్రేడర్ల ఊచకకోతపై ఒబామా భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు కార్చడంపై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ చెప్పారు. తుపాకులపై కొత్త కార్యని ర్వాహక చర్యలను ఒబామా మంగళవారం ప్రకటించారు. నేపథ్య పరిశీలన(బ్యాక్‌గ్రౌండ్ చెక్స్) విషయంలో  ‘తుపాకీ సంస్కృతి లొసుగులు’(గన్-షో లూప్‌హోల్స్) తగ్గించే అంశాలు ఈ చర్యల్లో ఉన్నాయి. అయితే దీనిపై ట్రంప్ ప్రతిస్పందిస్తూ తప్పు ఒబామా భావోద్వేంగంలో లేదని, కాకపోతే ఆయన భావంలోనే ఉందన్నారు. ఒబామా రెండవ సవరణ(ఆయుధాలు కలిగి ఉండడం)లోని అంశాలను ముక్కముక్కలుగా తీసుకుంటున్నార ని, రెండవ సవరణ అవసరం ఉండబోనంత వరకు ఆయన ఇలాగే చేస్తారని, ప్రజలకు రక్షణ కావాలని ట్రంప్ అన్నారు. విచ్చలవిడి కాల్పులకు(మాస్ షూటింగ్‌కు) సమాధానం ప్రజల వద్ద కొన్ని తుపాకులుకాక, వీలైనంత ఎక్కువ ఉండాలన్నదే తన వైఖరని ట్రంప్ పునరుద్ఘాటించారు.