Home వార్తలు ఊబకాయానికి బేరియాట్రిక్ శస్త్రచికిత్స

ఊబకాయానికి బేరియాట్రిక్ శస్త్రచికిత్స

obesity-image-done-in-otsప్రస్తుత పరిస్థితులలో మన జీవన శైలి వలన ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద వ్యాధిగా ఊబకాయాన్ని గుర్తించారు. ఊబకాయం తెచ్చే నష్టాల నుంచి బయటపడేవరకు ఎక్కువప్రయత్నంచేయటం లేదు. ఎందుకంటే ఊబకాయం అనేది ఒక్కసారిగా మనకు నష్టం కలిగించదు. అంచెలంచెలుగా మన శరీర అవయవాలను దెప్పతీస్తూ మనిషిని శారీరకంగాను, మానసికంగాను దెబ్బతీస్తుంది.
ఊబకాయం అంటే ఏమిటి?: మన శరీరంలో కొవ్వు కావాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదులో వుండి మన శరీరానికి హానికరంగా మారే వ్యాధిని ఊబకాయం అంటారు.
ఎందువల్ల వస్తుంది?: మనిషికి సాధారణంగా రోజు 2,400 కేలరీలు అవసరమవుతాయి. మనం దానికంటే ఎక్కువ కెలరీలు తీసుకొని దానికి తగ్గట్టుగా పని చేయకపోతే ఆ అదనపు కెలరీలు మన శరీరంలో కొవ్వుగా మారుతాయి. అలా రోజుకి కొంచెం చొప్పున కొవ్వు నిల్వలు పెరిగి ఊబకాయం స్థాయికి చేరుతుంది. దీంతో పాటు మన ప్రస్తుత జీవన విధానంలో పని ఒత్తిడి వల్ల గాని , బద్దకం వలన కాని, అనువైన సౌకర్యం లేకవల్ల గాని వ్యాయామం చేయక పోవడం, అధికంగా కూర్చొని పని చేయడం, ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోకపొవడం వల్ల ఊబకాయం వస్తుంది.
మరి కొందరిలో గర్బం దాల్చిన తరువాత, కొంత మందిలో పొగ తాగడం ఆపి వేసినాక కూడా రావొచ్చు. కొంత మందిలో సైకాలజికల్ వ్యాధి వల్ల అనగా ప్రతీ చిన్న విషయానికి కోపం వచ్చినా , చిరాకుగా వున్నా, ఏదో ఒకటి తింటూ వుండడం, మరికొందరిలో జన్యు సంబంధిత వ్యాధి వల్ల రావొచ్చు వారి కుటుంబంలో ఎవరైన లావుగా వుండటం వల్ల కూడా లావు అయ్యే అవకాశం వుంది. కొంతమందిలో వేరే వ్యాధుల వల్ల రావొచ్చు. ఉదాహరణకు హైపొ థైరాయిడ్ జబ్బు వలన, కుషింగ్స్ సిండ్రోం, పలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రొం వల్ల రావొచ్చు. మరికొంత మందిలో మందుల వలన రావొచ్చు.
ఉదాహరణ: స్టిరాయిడ్ వలన, డిప్రెషంకు వాడే మందుల వలన, ఫిట్స్ కి వాడే మందులు ఎక్కువ కాలం వాడడం వలన కూడా ఊబకాయం రావచ్చు.కొంతమందికి నిద్ర లేమి వలన గ్రేలిన్, లెప్టిన్ అనే శరీరంలో ఉత్పత్తి అయ్యే ,ఆకలికి సంబంధించిన హార్మొన్ ల హెచ్చుతగ్గుల వల్ల కూడా రావచ్చు.
ఊబకాయం వలన వచ్చే సమస్యలు
* గుందె జబ్బులు రావటం, గుండె పోటు
* కీళ్ళ జబ్బులు రావడం వలన కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స అవసరం కావొచ్చు.
* పక్షవాతం, షుగర్
* క్యాన్సర్, ప్రేగు, గర్బసంచి, పిత్తాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశం పెరుగుతుంది.
* నిద్రలేమి, నిద్ర మధ్యలో ఆక్సిజన్ అందక లేచిపోవడం అబిస్ట్రిక్టివ్ స్లీప్ ఆప్నియా
* పిత్తాశయంలో రాళ్ళు రావడం
* స్త్రీలలో రుతుస్రావం క్రమం తప్పడం , పిల్లలు కలగకపోవడం జరగ వచ్చు.
ఊబకాయం ఎలా గుర్తించవచ్చు: మన శరీర బరువు, ఎత్తును ఉపయోగించి మనం ఎంత లావుగా వున్నం అనేది బోడీ మాస్ ఇండెక్స్ ( B.M.I ) క్విట్లెట్ ఇండెక్స్ ద్వారా చెప్పవచ్చు.
బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏమిటి?
బేరియాట్రిక్ సర్జరీ అనగా లాప్రొస్కోపిక్ విధానం ద్వారా పెద్ద కోతలు లేకుండా బరువు తగ్గించడానికి చేసే శస్త్ర చికిత్స.
రెగ్యులర్ గా చేసే బేరియాట్రిక్ శస్త్ర చికిత్సలు
1. గాస్ట్రిక్ బైపాస్, 2. స్లీవ్ గ్యాస్ట్రిక్టమి
3. మినీ గ్యాస్ట్రిక్ బైపాస్,4. గ్యాస్ట్రిక్ బెలూన్
5. డుయోడినల్ స్విచ్
ఈ శస్త్ర చికిత్సల్లో వారి వారి బరువును, వారికున్న ఇతర జబ్బులను బట్టి, మీ ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా తెలుసుకుంటారు. బేరియట్రిక్ సర్జన్ మీకు అనువైనదేదో గురించి దాని ప్రకారంగా సలహా ఇస్తారు.
శస్త్ర చికిత్సవల్ల ఉపయోగాలు,అనర్థాలు
ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా చేసే శస్త్ర చికిత్సలు కీ హోల్ విధానం ద్వారా చేస్తారు. వాటి వల్ల ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి.
స్లీవ్ గ్యాస్ట్రక్టమి: ఈ శస్త్ర చికిత్సలో 75% ఉదరంను తొలగించి ఒక అరటిపండు ఆకారంలో ఉండే ఉదరాన్ని ఉంచుతారు. అందులో ఒక్కసారిగా 80-150 ఎం .ఎల్ పట్టేంత ఆహర పదార్థాలను మాత్రమే తీసుకోగలుగుతాము. ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ హార్మోన్ ను తొలగించిన భాగంలో ఉండేటట్లుగా చూస్తారు. దీని వలన తక్కువ మోతాదులో తింటారు, ఆకలి అనిపించదు.
ఉపయోగాలు: ఇది మిగిలిన బేరియాట్రిక్ శస్త్రచికిత్సలన్నింటికంటే తక్కువ రిస్కుతో కూడుకున్నది. దీని వలన 70% అధిక బరువు తగ్గటానికి అవకశాలు ఎక్కువ. ఆపరేషన్ టైం తక్కువగా ఉంటుంది . తొందరగా ఇంటికి వెళ్లవచ్చు. విటమిన్, మినరల్స్ లోపం ఈ శస్త్రచికిత్సలో చాలా తక్కువగా ఉంటాయి. షుగరు ఇతర సంబంధిత వ్యాధులను తగ్గించవచ్చు.
అనర్దాలు: రక్తస్రావం, స్టేపుల్ కుట్ల వద్ద లీకేజ్ కావడం వంటివి అరుదుగా వచ్చే అనర్దాలు. కొంచెం విటమిన్ లోపం ఉండే అవకాశం ఉంటుంది.
గ్యాస్ట్రిక్ బైపాస్: ఈ శస్త్రచికిత్స చాలా అధిక బరువు ఉన్న వారికి చేస్తారు. అనగా బి ఎం ఐ 50కి దగ్గరగా ఉన్నవారికి ఈ శస్త్రచికిత్స ద్వారా బరువును చాలా తగ్గించవచ్చు. ఇందులో ఉదరంను చాలా చిన్నదిగా చేసి దానికి చిన్నపేగుకు కలుపుతారు డైజెషన్ ఎంజైంస్ చిన్నపేగు మరొక భాగంలో కలిసే విధంగా చేస్తారు. దీని వలన తినే ఆహార గమనాన్ని మళ్లించి ఆహారం అబ్జర్వేషన్‌ను తక్కువ అయ్యేట్లు చూస్తారు.
ఉపయోగాలు: చాలా బరువు తగ్గటానికి ఉపయొగపదుతుంది. షుగరు, బి.పి ఇతర ఊబకాయ సంబంధిత రోగాలను తగ్గించవచ్చు.
అనర్దాలు: రక్తస్రావం, లీకజ్, చికిత్స సమయం ఎక్కువగా తీసుకుంటుంది, విటమిన్స్, మినరల్స్ లోపం ఎక్కువగా ఉంటుంది. దానివలన విటమిన్ మాత్రలు వాడవలసిన అవసరం ఉంటుంది. లోపల హిర్నియాలు వచ్చే అవకాశం ఉంటుంది.
మిని గ్యాస్ట్రిక్ బైపాస్: మొదట చెప్పిన రెండింటి మధ్యలో ఫిట్ అయ్యే శస్త్రచికిత్స. దీనిలో ఉదరంను కొంతభాగం ఉంచి చిన్న ప్రేగును 200-250సెం.మీ అవసరమును బట్టి, బైపస్ చేసి ఉదరంతో కలుపుతారు. దీంతో కూదా చాలా బరువు తగ్గించవచ్చు. షుగరు , ఇతర ఊబకాయ సంబంధిత వ్యాధులను విజయవంతంగా తగ్గించవచ్చు.
ఉపయోగాలు : చాలా బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. షుగర్, బి.పి ఇతర ఊబకాయం సంబంధిత రోగాలను తగ్గించవచ్చు.
అనర్దాలు: రక్తస్రావం, లీకజ్, విటమిన్స్, మినరల్స్ లోపం. విటమిన్ మాత్రలు వాడాల్సిన అవసరం ఉంటుంది.
ఉబకాయం వల్ల వచ్చే అనర్దాలతో పొలిస్తీ బేరియాట్రిక్ శస్త్రచికిత్స ద్వారా వచ్చే అనర్దాల కంటే ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. దీనివలన బరువు తగ్గటంతో పాటు ఉబకాయంతో పెనవేసుకున్న వివిధ వ్యాధులు షుగరు, బిపి, గుండెపోటు, మోకాళ్ళ నొప్పులు మొదలైనవి తగ్గించడమే కాక జీవన విధానంలో చాలా మార్పులు వస్తాయి.మిగిలిన వివిధరకాల శస్త్రచికిత్సలో ఉండే అనర్దాల శాతం మాదిరిగాను, బేరియాట్రిక్ శస్త్రచికిత్సలో కూడా ఉంటాయి. వివిధ స్టడిస్ ప్రకారం బేరియాట్రిక్ శస్త్రచికిత్సలో ఉండే అనర్దాలు పిత్తాశయం తొలగించే శస్త్రచికిత్సలోను, హప్ మార్పిడి శస్త్రచికిత్సలో ఉండే అనర్దాల కంటె తక్కువ శాతం ఉంది. అందువలన శస్త్రచికిత్సకు భయపడవలసిన పనిలేదు.