Home నిర్మల్ మార్కెట్ల కోసం స్థలం పరిశీలన

మార్కెట్ల కోసం స్థలం పరిశీలన

mam

మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్ : నిర్మల్ పట్టణంలో రైతు బజారు, ఫిష్ మార్కెట్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ చాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మానిటరింగ్ అండ్ అడిట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. రైతు బజారు, ఫిష్ మార్కెట్ల కోసం పాత వ్యవసాయ శాఖ గోదాములో ఉన్న ఖాళీ స్థలం గుర్తించినట్లు నిర్మల్ తహసీల్దార్ పేర్కొన్నారు. రైతు బజారు, ఫిష్ మార్కెట్ చేపట్టేందుకు సంబంధిత స్థలాలను స్వాధీనం చేసుకొనుటకు సంబంధిత అధికారులకు లేఖలు రాయించాలని కలెక్టర్ ఆదేశించగా కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివలింగయ్య, ఆర్ అండ్ బి శ్రీనివాస్ రావు, మత్సశాఖ సహాయ సంచాకులు దేవేందర్, సహాయ సంచాకులు దశరథ్, ఆర్‌డిఓ ప్రసునాంబ, వ్యవసాయ శాఖ సంచాలకులు వినయ్‌బాబు, తహసీల్థార్ శంకర్ పాల్గొన్నారు.