Home జయశంకర్ భూపాలపల్లి లక్ష్మీందేవీ పేటలో క్షుద్ర పూజలు

లక్ష్మీందేవీ పేటలో క్షుద్ర పూజలు

 

Occult

 

మన తెలంగాణ/వెంకటాపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీందేవిపేట గ్రామంలో పాత లక్ష్మీందేవిపేట ప్రాంతంలో గత వారం రోజులుగా ఏకంగా ఒక వాడను టార్గెట్ చేసుకుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్లపై, ఇండ్ల ఆవరణలో పిండితో మనిషిని పోలిన బొమ్మను తయారు చేసి ఎముకలు, పుర్రెలు, నిమ్మకాయలు, గాజులు, పసుపు కుంకుమ్మ , తెల్ల పిండి బొగ్గులు, బూడిద, ఎర్ర బట్టలు, తుమ్మ ముళ్ళతో , కొబ్బరి కాయలు , జీడి గింజలు , వెల్లి పాయలు, ఉల్లిగడ్డలు, ఆహారంతో ఎరుపు, తెలుపు పసుపుతో కలిపి ముద్దలుగా తయారు చేసి రోడ్లపై భారీగా రాత్రి 12 గంటలకు వీధి లైట్లు ఆప్ చేసి భయకరంగా క్షుద్రపూజలు నిర్వహించి గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. భయంతో గ్రామ ప్రజలు నిద్రలు మాని ఏ క్షణాన ఏమి జరుగుతుందో అని వణికి పోతున్నారు. అలాగే మురుగు రోడ్డులో ఉన్న బట్టలను తీసుకెళ్ళి పూజలు నిర్వహిస్తున్నారు. అదే వాడలో ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి కొందరు వ్యక్తులు వారి ఇంటి చుట్టు అలాగే ఇంటి బయట ఉన్న ఉప్పలమ్మ గుడిలో గాజులు, కోడి గుడ్డు, వెంట్రుకలు ఇతర సామాగ్రితో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఈ రోజు పరిశీలించడానికి వెంకటాపూర్ పోలీసు స్టేషన్ నుండి ఎఎస్సై మైసయ్య రావడం జరిగింది. గ్రామస్థులను ఇలాంటి క్షుద్ర పూజలతో మానసికంగా వేధిస్తున్న వ్యక్తులపై తక్షణమే చట్టపరమైన చర్య తీసుకుని, ఇలాంటి భయ బ్రాంతులు నుంచి రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

 

Occult Worship in Jayashankar Bhupalpally