Home స్పెషల్ ఆర్టికల్స్ నోకియా ఫోన్ పేలి యువతి మృతి!

నోకియా ఫోన్ పేలి యువతి మృతి!

Nokia-5233

భువనేశ్వర్: నోకియా మొబైల్ ఫోన్ పేలి యువతి మృతి చెందిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. నోకియాకు చెందిన 5233 మోడల్ ఫోన్ పేలడంతో ఉమా ఓరమ్(19) అనే యువతి చనిపోయింది. చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పేలుడుతో బాధితురాలి చేయి, కాలు, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై నోకియా బ్రాండ్ తయారీదారు హెచ్‌ఎండి గ్లోబల్ స్పందించింది. ఆ ఫోన్ తాము తయారు చేయలేదని వివరించింది. హెచ్‌ఎండి 2017 నుంచి మాత్రమే నోకియా బ్రాండ్ మొబైల్స్‌ను తయారుచేస్తోంది. దీంతో పేలిన ఫోన్‌ను తాము తయారు చేయలేదని సంస్థ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. తాము అన్ని జాగ్రత్తలతో అత్యంత నాణ్యమైన ఫోన్లను మాత్రమే విక్రయిస్తున్నట్లు అధికారి వెల్లడించారు. ఇక నోకియా 5233 మోడల్ పాతది.. ఇప్పటికీ ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుగుతున్నాయి.