Home తాజా వార్తలు ‘ఒడియన్’ తెలుగు టీజర్ విడుదల

‘ఒడియన్’ తెలుగు టీజర్ విడుదల

Odiyan Teaserమలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘ఒడియన్’. ఈ మూవీ తెలుగు టీజర్ విడుదలైంది. టీజర్ లో ‘ఒడియన్ .. వాడు చీకటి రాజ్యానికి రారాజు’, ‘ఇంతవరకూ నువ్వు నన్ను ఎన్నో రూపాల్లో చూసుంటావు .. నువ్వు చూడని రూపం ఒకటుంది’ అనే మోహన్ డైలాగ్స్ ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. మోహన్ లాల్ కు జోడిగా మంజు వారియర్ కనిపించనుంది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ నెల 14న భారీగా విడుదల కానుంది. కాగా, ఈ మూవీ తెలుగు రైట్స్ ఏకంగా 8 కోట్లు పలికినట్టుగా సమాచారం.

Odiyan Telugu Teaser is Released