Home ఎడిటోరియల్ ప్రమాదకర యుద్ధ చిత్రం: సిరియా

ప్రమాదకర యుద్ధ చిత్రం: సిరియా

Syriaసిరియా యుద్ధ ముఖచిత్రం మరింత ప్రమాద కరంగా కనిపిస్తోంది. ఇటీవల రష్యా సిరియా తిరుగు బాటుదారులను ఎదుర్కొనేందుకు తాము కూడా రంగంలోకి దిగుతానని ప్రకటించడం, మరోవైపు అమెరికా దాని మిత్రదేశాలు కూడా సిరియాపై విరుచుకుపడుతున్న తరుణంలో అది మరింత నెత్తురోడుతోంది. ఐసిస్ తీవ్రవాదులను లక్షంగా చేసుకుని సాగుతున్న వైమానిక దాడుల ఫలితంగా క్షేత్రస్థాయిలో అనేకమంది అమాయకుల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఇన్ని దాడులు జరుగుతున్నా, అనేకమంది ప్రాణాలు పోగొట్టుకున్నా, లక్షలమంది శరణార్థులుగా మారినా ఇంతవరకూ సిరియా సంక్షోభాన్ని రాజకీయంగా పరిష్కరించాలని అగ్ర రాజ్యాలు భావించకపోవడం విచారకరం. అంతకు ముందు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సిరియా సంక్షోభానికి రాజకీయ పరిష్కారం చూపా లనే ప్రయత్నాన్ని రష్యా తన వీటో అధికారాన్ని వినియోగించి సిరియాపై తీర్మానాలను అడ్డుకుందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి కారణం సిరియాపై దాడులుచేసే అంశంపైన కాని, సిరియా యుద్ధ వ్యూహంలో తనను అసలే పరిగణనలోకి తీసు కోవడం లేదనే నెపంతో రష్యా తనవీటోతో తీర్మానా లను అడ్డుకుంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశాల్లో రష్యా పాల్గొంది. ఆ సందర్భంగా అమెరికా, దాని మిత్రపక్షాలతో జరిగిన చర్చల్లో సిరియాపై రష్యా ఒక అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో సిరియా తిరుగుబాటు దారులపై తాము కూడా దాడులు చేస్తామని వెంటనే ప్రకటించి సిరియా భూభాగంలో వైమానిక దాడులను రష్యా ప్రారంభించింది. రష్యాను సిరియా అంశంలో దారికి తెచ్చుకోవడానికి అమెరికా, దాని మిత్రపక్షాలు “ఉక్రెయిన్‌” అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు అవగత మవుతోంది. రష్యా సిరియా యుద్ధ సంక్షోభంలో భాగ మవుతుందని తెలిసి అమెరికా, దాని మిత్రపక్షా లకు ఊరటనిచ్చింది. కానీ వెంటనే వాటి నోట్లో పచ్చి వెలక్కాయ పడేరీతిలో రష్యా తన దాడులను ఆరం భించింది. అసలు కిటుకు ఇక్కడే వుంది. అదే సిరియా యుద్ధ చిత్రంలో వ్యూహా త్మక అంశంగా మారింది. అమెరి కా కు అనుకూలం గా ఉండి, సిరియా అధ్యక్షుడు బషీర్ అల్-అసద్‌ను వ్యతిరేకించే తిరు గుబాటు దారు లు కొందరున్నారు. వీరిలో చాలామంది తిరుగుబాటు దారులు అమెరికా సిఐఎ శిక్షణనిచ్చి సిరియా అధ్యక్షుడికి వ్యతిరేకంగా పోరాడమని చెప్పి వారికి సహాయ సహకారాలు అందిస్తోంది. రష్యామాత్రం సిరియా అధ్యక్షుడు అల్ అసద్‌కు ఎప్పటినుంచో తన సహాయ సహకారాలనందిస్తోంది. ఇది అమెరికాకు మింగుడుపడడం లేదు. దీనికితోడు ఐసిస్ తీవ్ర వాదులు, అమెరికా దాని మిత్రపక్షాలకూ, సిరియా అధ్యక్షుడు అల్‌అసద్‌కూ ఉమ్మడి శత్రువు. ఐసిస్‌కు అమెరికా శత్రువు. రష్యాకు అమెరికా మద్దతున్నా సిరియా తిరుగుబాటుదారులు శత్రువులు. సిరియా కు, ఐసిస్‌లకు కుర్దిష్ వేర్పాటువాదులు శత్రువులు. వీరికితోడు యెజ్దీలు, పక్కనున్న ఇరాక్ లో నున్న కొన్ని వర్గాలు ఐసిస్, సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వీటికితోడు సున్నీ, షియా సమీకరణలు తోడై సిరియా యుద్ధ ముఖచిత్రం అత్యంత భయానకంగా మారింది. ఒకవైపు పండు ముదుసలి నుంచి రోజులవయసున్న శిశువులు, నవజాత శిశువులు అందరూ శరణార్థులుగా మారి ఇతర దేశాలకు ప్రాణాలకు తెగించి, అరచేతిలో పెట్టుకుని వసల వెళుతుంటే అంతర్జాతీయ శక్తులకు ఏ మాత్రం పట్టకుండా యుద్ధవ్యూహాలను రచిస్తు న్నాయి. కనీసం సత్తువలేక, ఆర్థికంగా చితికివున్న వారు మాత్రం యుద్ధంలో సమిధలవుతూ బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుం డడం బాధాక రం. మరోవైపు సిరియా అధ్యక్షు డు – ప్రభుత్వాని కి పట్టున్న సిరియా భూభా గంలోకి కూడా యుద్ధ జాడ కనిపిస్తుండడంతో రానున్న రోజుల్లో అది మరింత రక్తతర్పణానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అత్యంత అమానవీయ పరిస్థితుల్లో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. సిరియా శరణార్థులకు పొరుగున ఉన్న టర్కీ కూడా ద్వారాలు మూసేసి, సరిహద్దులను కట్టడి చేయడంతో శరణార్థులు మరింత వేదనకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన ఐక్య రాజ్యసమితి సమావేశాల్లో యుద్ధంలో ఎవరెవరు పాల్గొనాలి, ఎలా దాడులు చేయాలి అన్న వ్యూహాలకు పదును పెట్టారే తప్ప లక్షల్లో శరణార్థులుగా మారి ఇతర దేశాల్లో బికారీగా జీవనం వెళ్లదీస్తున్న వారి గురించి వ్యూహాత్మకంగా ఎలాంటి చర్చ చేయలేదు.
ఇక ఇండియా విషయానికొస్తే, మరీ ముఖ్యంగా ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం, దానికి నేతృత్వం వహిస్తున్నవారితీరు, వారి దౌత్యవిధానాలు ఆశ్చర్య కరంగా ఉన్నాయి. సిరియా సంక్షోభంపట్ల ఇండియా ఎలాంటి భావాన్నీ వ్యక్తం చేయడం లేదు ఇప్పటి వరకు. కనీసం యుద్ధంలో విగతజీవులైన వారికి, శరణార్థులకు ఏదో ఒక సాయం భారత్ అందిం చొచ్చు. కానీ ఆ దిశగా ఆలోచించలేదనే అనిపి స్తోంది. నరేంద్రమోడీ ప్రధానిగా ఇటీవల అమెరికా పర్యటనలో, అనేక వేదికల్లో అనేకమంది రాజకీయ, రాజకీయేతర ప్రముఖులను కలిశారు. వేదికల్లో ప్రసంగించారు. ఇందులో ఎక్కడా కూడా సిరియా బాధితుల గురించి కనీసం మాట్లాడలేదు. అంతే కాదు ఐక్యరాజ్యసమితి సాధారణసభ సమావేశంలో ఉపన్యాసం చేసినా అందులో సిరియా గురించి ప్రస్తావించలేదు. సిరియాలో శాంతి, ప్రజాస్వామ్యా న్ని ఇండియా కోరుకుంటున్నదనే భావనను దేశం తరఫున వ్యక్తం చేసి ఉంటే ఇంకా ప్రతిష్ట ఇనుమ డిస్తుందే కానీ మసిబారదు. అంతర్జాతీయ అంశాల్లో
భారత్ ఏదో ఒక సందర్భంలో తన వైఖరిని వెల్లడిం చాలి. భారతీయ దౌత్య వ్యవస్థ ఎందుకింత బండ బారిందో అంతు బట్టటంలేదు. దౌత్యం అంటే కశ్మీర్ చుట్టూ తిరిగే పాక్‌కు అను సంధా నమైన అంశాలే కాదు. ఇంకా ఎన్నో ఉంటా యి. అందులో సిరియా ఒకటి అన్నది గుర్తుంచుకోవాలి.
ఒకవైపు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం (వీటోతో) కావాలని లాబీయింగ్ చేస్తూ, మరోవైపు సిరియా సంక్షోభంపట్ల అంటీముట్ట నట్లుగా వ్యవహరించడం అవివేకమే అవుతుంది. శాశ్వత సభ్యత్వం కోరుకునే దేశాల లక్షణం, స్వరూపం వేరేలాగా ఉండాలి. ఉదాహరణకు జర్మనీ కూడా శాశ్వత సభ్యత్వాన్ని కోరుకుంటోంది. ఆ దేశం అనేక అంతర్జాతీయ అంశాల్లో స్వతంత్రంగా వ్యవహరించింది. ఉదాహరణకు గ్రీసు సంక్షోభం, శరణార్థుల సమస్యను చొరవ తీసుకుని ఒడుపుతో పరిష్క రించింది. అలాంటి స్వభావం ఉంటేనే శాశ్వత సభ్యత్వానికి దారులు ఏర్పడుతాయి.
రచయిత ః అంతర్జాతీయ నిపుణుడు
(డెవలప్ మెంట్, డెమొక్రసీ, జియోపాలిటిక్స్ అంశాల్లో)
94401 36718