Search
Sunday 18 November 2018
  • :
  • :

ఫ్లిప్‌కార్ట్ 2018 మొబైల్ బొనాంజా సేల్

flip

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం పురస్కరించుకుని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఫోన్లపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. 2018 జనవరి 3 నుంచి 5 వరకు వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ఇవ్వనుంది. రూ. 99కే బైబ్యాక్ గ్యారంటీ సదుపాయాన్ని కల్పిస్తోంది. దీని కింద వినియోగదారుల పాత ఫోన్లకి పూర్తిగా 50 శాతం వరకు చెల్లించనుంది. నో కాస్ట్ ఇఎంఐ సదుపాయాన్ని కల్పిస్తూ పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేవారికి కంపెనీ షరతుల మేరకు పూర్తిగా రూ. 18వేల వరకు చెల్లించే అవకాశముంది. దేశంలో ఎక్కువగా సేల్ అయ్యే స్మార్ట్‌ఫోన్ షియోమీ నోట్ 4 ధర ప్రస్తుతం రూ. 12,999గా ఉండగా, ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 10,999 కే లభించనుంది. అలాగే రూ. 14,999 విలువ చేసే షియోమీ ఎ1 రూ. 12,999కి లభించనుంది. గూగుల్ పిక్సెల్ 2 పై రూ. 13,001, పిక్సెల్2 ఎక్స్‌ఎల్‌పై రూ. 8,001 డిస్కౌంట్ లభించనుంది. వారి పాత మొబైల్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త పిక్సెల్ 2ఎక్స్‌ఎల్ కొనే వినియోగదారులకు అదనంగా మరో రూ. 4 వేలు తగ్గనుంది. ఇదే వరుసలో మోటో జి5 ప్లస్, మోటో సి, మోటో సి ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఆన్ నెక్ట్(16జిబి) తదితర స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.

Comments

comments