Home హైదరాబాద్ కలెక్టరేట్‌లో.. నేటి నుంచి ఈ-ఆఫీస్ అమలు

కలెక్టరేట్‌లో.. నేటి నుంచి ఈ-ఆఫీస్ అమలు

 office approach will come into force in todays collectorateమన తెలంగాణ/సిటీ బ్యూరో: సాంకేతిక విప్లవంతో విశ్వమే ఓ కుగ్రామంగా మారి పోయింది. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికతతో ప్రభుత్వ పాలనా విధానం సైతం సంస్కరణల బాటపట్టింది. జిల్లా స్థాయిలో ఓ పనికి సంబంధించిన ఫైళ్లు జూనియర్ అసిస్టెంట్ నుంచి సర్కులేట్ అయితే అది కలెక్టర్ వద్దకు చేరేవరకు నెలలు పట్టింది. కానీ అందివచ్చిన టెక్నాలజీ కారణంగా పూర్తిగా కంప్యూటర్ కాలంగా మారిన నేడు నిమిషాల్లోనే పని పూర్తివుతుంది. అలాంటి టెక్నాలజీని పరిపాలనకు జోడించి ప్రజల సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించడంతో పాటు వారికి పారదర్శకంగా సేవలను అందించడమే లక్షంగా నేటి నుంచి కలెక్టరేట్‌లో సంపూర్ణంగా ఈ -ఆఫీస్ విధానం అమలు కానుంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని గతంలో జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన రాహుల్ బొజ్జా 2016 అక్టోబర్ 1వ తేదీన జిల్లాలో ఈ- ఆఫీస్ ప్రొగ్రాంను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అదే రోజు నుంచి కలెక్టరేట్‌లో ఈ ఆఫీస్ విధానం ద్వారానే కార్యకలపాలను చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు అనుగుణంగా కొంత మేర కసరత్తు సైతం జరిగింది. ఇందులో భాగంగా కలెక్టరేట్‌లో 2016 సెప్టెంబర్ 30 నాటికి 15 వేల ఫైళ్లు ఉండగా 15 లక్షల కాఫీలు ఉన్నాయన్నారు. వీటిని డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టడం జరిగిందని ఇప్పటీకి 4500 పైళ్లకు సంబంధించిన 5 లక్షల కాఫీలను స్కానింగ్ చేసి కంప్యూటర్లలో భద్రపర్చారు. కాని అధికారులు అలసత్వం, ఉన్నతాధికారులు పర్యావేక్షణ లోపం కారణగా అయితే గడిచిన 22 నెలలుగా ఎప్పటీ కప్పుడు వాయిదా ఈ ఆఫీసు విధానం వాయిదా పడుతూ వచ్చింది.

రాహుల్ బొజ్జా తర్వాత గత ఏడాది అగస్టు 17న జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా సైతం ఈ -ఆఫీస్‌పై అంతగా దృష్టి సారించకపోవడంతో అధికారులు సైతం ఫైళ్లను సర్కూలేట్‌ను పాతవిధానంలో కొనసాగించారు. అయితే గత మే లో ఈ ఆఫీస్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ ఈ కార్యక్రమానికి ఇంఛార్జీ జాయింట్ కలెక్టర్ శ్రీవత్స కోట ను నోడల్ అధికారిగా నియమించారు. దీంతో ఈ ఆఫీస్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన ఇందుకు కావాల్సిన పనులను పూరి చేస్తు వచ్చారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం జూలై 1 నుంచి కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల అధికారులు ఈ ఆఫీస్ విధానంలో విధులు నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన ఈ ఆఫీస్ విధానం నేటి నుంచి కలెక్టరేట్‌లో అమల్లోకి రానుంది.
ఈ ఆఫీస్‌తో ఇక పనుల్లో వేగం: ఈ ఆఫీస్ విధానం అమల్లోకి వస్తే ప్రజల ఇక తమ పనుల నిమిత్తం నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరగకుండానే రోజుల్లోనే పనులు పూర్తి కానున్నాయి. ఈ ఆఫీస్ ప్రక్రియ అమలు చేయడంతో అధికారులు, సిబ్బంది పనితీరు సులభతరం కావడమే కాకుండా తప్పించుకునే వీలుగా లేకుండా బాధ్యత మరింత పెరగనుంది. ఈ విధానం ద్వారా అధికారులు తమకు కేటాయించిన ప్రత్యేక ఐడితో వారు ఆఫీసులో లేకపోయిన కంప్యూటర్ నెట్ ఉంటే చాలు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థరాత్రికి కూడా ఇంటి వద్ద నుంచి కూడా విధులు నిర్వహించేందుకు వీలుంటుందని చెప్పారు. ఫైళ్లును ఒకే చేయవచ్చు. తద్వారా ప్రతి ఫైళ్లు గంటల వ్యవధిలో పూర్తి చేసే అవకాశం ఏర్పడనుంది. ఈ ఆఫీస్ తో ఆ అవకాశమే ఉండకపోగా, సురక్షితంగా ఉండనున్నాయి.
దశల వారిగా జిల్లా ఆఫీసులో కూడా ఈ ఆఫీస్
దశల వారిగా జిల్లా ఆఫీసుల్లో కూడా ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేయనున్నారు. ముందుగా ఆర్డీఓ, తహసిల్దార్ల కార్యాలయాల్లో సైతం ఈ విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్‌ఐసి చేస్తోంది.