Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నాగ్, వర్మల ‘ఆఫీసర్’

officer

నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ కలయికలో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్’. కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్‌గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “ఆఫీసర్ కథ వర్మ చెప్పగానే నాకు ఎంతగానో నచ్చింది. కానీ వర్మ ఈ సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో వేరే సినిమా అవకాశం వచ్చిందని వెళ్లిపోతాడేమోనని భయమేసింది. మళ్లీ నాలుగు నెలల తరువాత వర్మ వచ్చి అదే కథ చెప్పి… తప్పకుండా చిత్తశుద్ధితో ఈ సినిమా చేస్తానని చెప్పాడు. చెప్పింది చెప్పినట్లుగా వర్మ ఈ సినిమా తీసి చూపించాడు. శివ విడుదల తర్వాత అందరు ముఖ్యంగా సౌండ్ గురించి మాట్లాడారు. ఆఫీసర్ సినిమా విడుదల తర్వాత కూడా సౌండ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్ ప్రేక్షకుల గుండెను తాకేలా ఉంటాయి”అని అన్నారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ “ఈ సినిమాలో నాగార్జున పాత్ర కొత్తగా ఉంటుంది. శివ సినిమా తర్వాత నేను పూర్తిస్థాయిలో హీరో ఎలివేషన్ సినిమాను ‘ఆఫీసర్’తో చేయడం జరిగింది. క్రిమినల్స్ నుండి సమాజాన్ని కాపాడటం పోలీస్ ఆఫీసర్‌ల వృత్తి. ముంబయ్‌లో ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పిన పాయింట్ ఆధారంగా ఈ కథను రాసుకోవడం జరిగింది. నేను రాసుకున్న పోలీస్ ఆఫీసర్ పాత్రకు నాగార్జున పూర్తిగా న్యాయం చేశాడు”అని తెలిపారు. హీరోయిన్ మైరా సరీన్ మాట్లాడుతూ “నాగార్జున, రామ్‌గోపాల్ వర్మతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు నా పాత్రను చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను”అని పేర్కొన్నారు.

Comments

comments