Home సినిమా రేపే ‘ఆఫీసర్’ టీజర్‌

రేపే ‘ఆఫీసర్’ టీజర్‌

nag

తెలుగు చలన చిత్ర చరిత్రలో ‘శివ’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన నాగార్జున, రామ్‌గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్’. అంతం, గోవిందా గోవిందా చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్‌లో  వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో నాగార్జున పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. శనివారం రామ్‌గోపాల్ వర్మ జన్మదినం సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. మే 25న ఈ సినిమా విడుదలకానుంది. మైరా శరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్, షాయాజీ షిండే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని కంపెనీ బ్యానర్‌పై సుధీర్ చంద్ర, రామ్‌గోపాల్‌వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.