Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

అవినీతి అధికారులపై వేటు

Officers Suspend  Basara Temple Priests

 ఆరుగురు ఈఓలకు చార్జీ మెమోలు జారీ  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేపట్టాలి  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : నిర్మల్ జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆరుగురు ఈఒలపై వేటు పడింది. శుక్రవారం రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవా దాయ శాఖ మంత్రి సచివాలయంలో దేవాదాయ శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గత మూడు సంవత్సరాల నుండి పని చేసిన ఆరుగురు ఈఒలు విధుల్లో నిర్లక్షం వహించినట్లు విచారణలో తేలడంతో వారికి చార్జీ మెమోలు జారీ చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ ఆదేశించారు. అలాగే బాసర ఆలయంలో పని చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా సిబ్బందికి కూడా వారం రోజుల్లో చార్జీ మెమో జారీ చేయాలని ఆలయ ఈఒను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. అంతే కాకుండా ఆలయంలో నిధులు దూర్వినియోగం చేసిన సి బ్బంది నుంచే సొమ్మును వసూలు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని మిగతా ఆలయాల్లో పని చేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ అధికారులు, సి బ్బందిపై రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. విచారణలో అవినీతి ఆరోపణలు రుజవైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయల్లో ఆన్‌లైన్ సేవలు, దూపదీప నైవేద్యం, కామన్‌గూడ్ ఫండ్, ప్రత్యేక అభివృద్ధి అనే అంశాలపై సమావేశంలో చర్చించారు.

Comments

comments