Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

భార్య మోసం చేస్తే… ‘బ్లాక్‌మెయిల్‌’(ట్రైలర్)

Black-Mail

ముంబయి: బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో, అభినయ్‌ డియో దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘బ్లాక్ ‌మెయిల్‌’. గురువారం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్‌లో.. ఇర్ఫాన్‌ భార్య మరో వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుంటుంది. అనుమానం వచ్చిన ఇర్ఫాన్ భార్యను వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూస్తాడు. దీంతో ఇర్ఫాన్‌ ‘మోసం చేసిన తన భార్యను చంపాలా? లేక ఆమెతో ఉన్న వ్యక్తిని చంపాలా?’ అని తనమిత్రుడితో చర్చిస్తుంటాడు. అలా కాకుండా మోసం చేసిన భార్యను బ్లాక్‌మెయిల్‌ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయంతో ఇర్ఫాన్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, తన భార్యతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఏం చేశాడు అనేది సినిమా కథాంశంగా తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 6న ‘బ్లాక్ ‌మెయిల్‌’ విడుదల కానుంది. 

Comments

comments