Search
Sunday 18 November 2018
  • :
  • :

అధికారులు సమర్థవంతంగా పని చేయాలి : ఎంఎల్‌ఎ రెడ్యానాయక్

table

మన తెలంగాణ/కురవి : ఈ వేసవిలో మంచినీటి సమస్యను అధిరోహించడానికి అధికారులు సమర్థవంతంగా పని చేయాలని ఎంఎల్‌ఎ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపిపి కార్యలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో సుధనపల్లి సర్పంచ్ ధన్‌సింగ్‌తో పాటు మరి కొంత మంది సర్పంచ్‌లు ఈ సంవత్సరం వేసవిలో గ్రామాల్లో ప్రజల మంచినీటి సమస్యలు పరిష్కరించుటకు కిరాయి బావులు కల్పిస్తున్నారా లేదా అన్ని సంబంధిత ఎఇని అడిగారు. దీంతో స్పందించిన అధికారి మిషన్ భగీరథ పథకం పనుల వల్లా ప్రభుత్వం నిధులు కేటాయించడంలేదని కేవలం గ్రామ జిపీకి వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను వాడుకోవాలని సూచించారు. దీంతో వైస్ ఎంపిపి పెద్ది వెంకన్న లేచి సర్పంచ్‌లు నిధులను ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నారని, అధికారులు ఎంబిలు చేయకూడదని తెలుపడంతో ఒక్కసారిగా సర్పంచ్‌లు లేచి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని, గ్రామంలో నెలకొన్న సమస్యల కోసం నిధులు ఖర్చు చేస్తున్నామని సర్పంచ్‌లకు, వైస్ ఎంపిపి మధ్య కొద్దిసేపు రచ్చ మొదలైంది. తదుపరి డిప్యూటీ తాహసీల్దార్ శేషగిరిరావు మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యంపై వివరించారు. దీంతో సర్పంచ్‌లు రేషన్ కార్డుల అవకతవకలపై లేవనెత్తారు. అర్హులైన కార్డులు తొలిగించడం సరికాదని, ప్రభుత్వం ద్వారా సరుకులు ఎందుకు రావడంలేదని అధికారిని నిలదీశారు. కార్డులపై కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. అవి సరిచేయడానికి మాచేతిలో లేదు ప్రభుత్వం ద్వారా చేయాల్సిందేనని చెప్పడంతో లేదు మీ ఇష్టం వచ్చినట్లు రేషన్ కార్డులు తొలగిస్తున్నారని రచ్చ రచ్చ చేశారు. కళ్యాణలక్ష్మి పథకం దరఖాస్తులపై నిర్లక్షం చేస్తున్నారని, లబ్ధిదారులను కార్యలయం చుట్టు తిప్పించుకుంటున్నారని ఆరోపంచారు. ఈ సమావేశంలో ఎంపిపి బజ్జూరి ఉమపిచ్చిరెడ్డి, జడ్పిటిసి కొనతం కవిత విజయ్, ఎంపిడిఒ కృష్ణవేణి, ఆలయ చైర్మన్ రాజునాయక్ అధికారులు, సర్పంచ్, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments