Home నిజామాబాద్ డ్రైవర్ నిద్ర మత్తు.. వాగులో పడిన ఆయిల్ ట్యాంకర్

డ్రైవర్ నిద్ర మత్తు.. వాగులో పడిన ఆయిల్ ట్యాంకర్

Oil tanker bridge over the river

మద్నూర్ :మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గేటు సమీపంలో 161వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామునే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ బ్రిడ్జి పై నుడి వాగులో పడి పోయింది. వివారాల్లోకి వెలితే గుజురాత్ నుండి చెన్నైకి వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ తెల్ల వారు జామున డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో బ్రిడ్జి పైనుండి వాగులో పడి పోయిందని ఎస్ఐ మహమ్మద్ పాజిద్ తెలిపారు. గుజరాత్ నుండి గత నాలుగు రోజుల క్రితం 20వేల లిటర్ల మంచి నూనే లోడుతో బయలు దేరగా పెద్ద ఎక్లార సమీపంలో వాగులో బోల్తా కొట్టిందని ఈ ప్రమాదంలో డ్రైవర,క్లీనర్‌లకు స్వల్ప గాయాలయ్యాయని ఎస్ఐ పేర్కొన్నారు. ట్యాంకర్ వాగులో పడడంతో ట్యాంకర్ లోని ఆయిల్ మొత్తం వాగులో కారి పోయింది.విషయం తెలుసుకున్న చుట్టు ప్రక్కల గ్రామస్తులు ఆయిల్ కోసం పోటి పడి మరి డబ్బాలతో ,బిందేలతో తీసుకెళ్ళారు.