Search
Tuesday 20 November 2018
  • :
  • :

ఆయిల్‌ ట్యాంకర్‌ ప్రమాదం.. 9మంది సజీవ దహనం

Oil tanker explosion kills at least 9 in Nigeria

లాగోస్‌: నైజీరియాలోని లాగోస్‌ నగరంలో ఆయిల్‌ ట్యాంకర్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. అవి క్రమంగా వ్యాపించి చుట్టూ ఉన్న వాహనాలను అంటుకోవడంతో అవి కూడా దగ్ధం అయ్యాయి. దీంతో ఆయిల్‌ ట్యాంకర్‌ క్యాబిన్‌లో ఉన్న నలుగురితో పాటు బయటి వాహనాల్లోని మరో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 54వాహనాలు కాలి బూడిదైనట్టు తెలుస్తోంది.

Comments

comments