Search
Wednesday 14 November 2018
  • :
  • :

టీచర్ల బదిలీలకు ఓకె

High Court Bar Council Election Polling Started in Telangana

ప్రక్రియ నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ 

ఉమ్మడి జిల్లాల డిఇఒలకు అధికారం ఇచ్చిన నిబంధన రద్దు
పిటిషనర్ల వాదనల త్రోసివేత

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యా య బదిలీ ప్రక్రియకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు చెప్పింది. బదిలీ ప్రక్రియను నిలివేసేందుకు ధర్మాస నం నిరాకరించింది. అయితే బదిలీ ఉత్తర్వుల అధికారాన్ని పూర్వపు పది జిల్లాల విద్యాధికారులకు (డిఇ ఒ) అప్పగించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. డిఇఒలకు అధికారం కల్పించే ఉపాధ్యాయ బదిలీ నిమిత్తం జారీ చేసిన జిఒలోని 4వ నిబంధన చెల్లదని సోమవా రం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పులో పేర్కొం ది. ఈ నిబంధన మినహా పిటిషనర్లు లేవనెత్తిన మిగిలిన అభ్యంతరాలను బెంచ్ త్రోసిపుచ్చింది. బదిలీలకు ఉద్దేశించి జారీ అయిన జిఒ 16లోని 4వ నిబంధన చెల్లదు. డిఇఒలు స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు అధికారం ఇవ్వడం సబబుకాదు. 31 జిల్లాల ఏర్పాటు చేసిన తర్వాత పూర్వపు పది జిల్లాల డిఇఒలకు అధికారం కట్టబెట్టడం చెల్లదు. ఏకీకృత సర్వీస్ నిబంధనలపై హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ అమల్లో ఉందని చెప్పి బదిలీలను నిలిపి వేయాలన్న పిటిషనర్ల వాదన చెల్లదు. విద్యా చట్టంలోని 99(3) నిబంధనపై అసెంబ్లీ చర్చించాలని పిటిషనర్ అభ్యర్థనను ఆమోదించలేము. బదిలీలకు కొత్త రూల్స్ జారీ చేశారని, ఇది ఇతర ఉద్యోగుల భర్తీ నిషేధాన్ని ఎత్తేయడమే అవుతుందన్న వాదన సరికాదు. 1975లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా బదిలీ ప్రక్రియ ఉందనే వాదనకు చట్టబద్ధ లేదు. వెబ్ కౌన్సిలింగ్ తెలియని వాళ్ళు అధికారుల సాయం పొందాలేగానీ వెబ్ కౌన్సింగ్ చెల్లదనడం సబబుకాదు. బదిలీలకు ముందే పదోన్నతి ఇవ్వాలన్న వాదన ఆమోదయోగ్యం కాదు.వీలైనంత వరకూ భార్యభర్తలకు ఒక చోట పోస్టింగ్స్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి.. అని హైకోర్టు తీర్పులో పేర్కొంది. ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై వాదప్రతివాదనలు ముగిసిన అనంతరం ధర్మాసనం గత నెల 21న తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీ నిబంధనలు ఉన్నాయి. జెడ్పీ, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకే సర్వీస్ నిబంధనల ఉత్తర్వులపై హైకోర్టు యథాతథస్థితి ఉత్తర్వులు ఇచ్చింది. జెడ్పీ టీచర్లను బదిలీ చేసే అధికారం డీఈవోలకు లేదు. కాబట్టి బదిలీ ప్రక్రియను నిలిపివేయాలి.. అని జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు వేరువేరుగా దాఖలు చేసిన పలు వ్యాజ్యాలు హైకోర్టు తీర్పుతో పరిష్కారమయ్యాయి.

Comments

comments