Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కోడి పందేలకు ఓకే

Rajappa

రాజమహేంద్రవరం : సంక్రాంతి పండుగను పురష్కరించుకుని మూడు రోజుల పాటు కోడి పందేలు నిర్వహించుకోవచ్చని ఎపి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. చట్టాలను గౌరవించాలని, ఈ క్రమంలో తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న రాజమహేంద్రవరం రూరల్ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరిని చినరాజప్ప శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Ok to Hen Competitions

Comments

comments