Home అంతర్జాతీయ వార్తలు అక్కడికి పురుషులకే ప్రవేశం.. అదీ బట్టలు లేకుండా..!

అక్కడికి పురుషులకే ప్రవేశం.. అదీ బట్టలు లేకుండా..!

Men-Okinoshima

టోక్యో : అది జపాన్  లోని ఓ పవిత్ర ప్రాంతం.. ఎన్నో ఏళ్లుగా ఓ ప్రాంతానికి చెందిన ప్రజలు భక్తి.. శ్రద్ధలతో పూజలు నిర్వహించే స్థలం.. అయితే ఆ ప్రాంతాన్ని సందర్శించాలి అంటేనే ఓ పెద్ద చిక్కుంది. అక్కడిని స్త్రీలను అనుమతించరు… ఇది చాలా చోట్ల ఉన్న ఆచారమే.. కానీ పురుషులు అక్కడి రావాలంటే కూడా మరో కండీషన్ ఉంది. ఆ ప్రాంతాన్ని పురుషులు సందర్శంచాలంటే బట్టు విప్పేసి నగ్నంగా సముద్రంలో ప్రయాణించి చేరుకోవాలి.. కొన్ని వందల ఏళ్లుగా ఒకినోషిమా దీవిలో  షింటో పూజారి అక్కడి దేవతను ఆరాంధించేందుకు ఉన్న నిబంధనలు ఇవీ…

ఈ ఏడాది ఆ దీవిలో కేవలం రెండు గంటలపాటు జరిగే వేడుకకు గాను 200 మందిని మాత్రమే అక్కడి పూజారి అనుమతించారు. కానీ యునెస్కో అనుమతితో ఈ దీవికి మరింత ప్రచారం లభిస్తే.. అక్కడికి చేరుకొనే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నిబంధనలు తెలుసుకొని కొందరు ఆ ప్రాంతానికి వెళ్లాలంటే జంకుతున్నారు. మరోవైపు ఒకవేళ బయటి వారు తమ ప్రాంతాన్ని సందర్శిస్తే.. ఆ ప్రాంతం పవిత్రత పోతుందని అక్కడి వాళ్లు భయపడుతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బయటి వారిని తమ ప్రాంతానికి అనుమతించబోమని ఒకినోషిమా దీవి ప్రజలు చెబుతున్నారు. అయితే, ఆడవారికి ప్రవేశం నిరాకరించటంపై ఓ అధికారి స్పందిస్తూ.. దీనిపై తామేమీ చేయలేమని వ్యాఖ్యానించారు. మహిళలు సముద్రంలో ప్రయాణించి అక్కడికి చేరుకోవటం చాలా ప్రమాదకరమని భావిస్తారని, శతాబ్ధాలనాటి ఆనవాయితీని దేవాలయాన్ని మార్చుకోబోదని అన్నారు.