Search
Friday 21 September 2018
  • :
  • :

మహిళను వేధించిన ఓలా డ్రైవర్ అరెస్ట్!

Ola-Bil

హైదరాబాద్ : మహిళా ప్రయాణికురాలిని తీవ్రంగా వేధించిన కేసులో ఓలా కంపెనీ క్యాబ్ డ్రైవర్ ని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి సమీప గౌలిదొడ్డి నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకుగానూ ఓ మహిళ ఓలా షేరింగ్‌ క్యాబ్‌ను బుక్‌ చేశారు. ఆమె గౌలిదొడ్డిలో కారు ఎక్కగా.. మిగితా ప్యాసింజర్లందరూ.. కొద్ది దూరం తర్వాత దిగిపోయారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉన్న ఆ మహిళను ఆ క్యాబ్ డ్రైవర్ వేధించడం ప్రారంభించాడు. తన మొబైల్ నెంబర్ ఇవ్వాలని, దానికి ఆమె నిరాకరించడంతో కారును పివి నర్సింహరావు ఎక్స్‌ప్రెస్‌వేపైకి మళ్లించాడు. దీంతో భయపడిపోయిన మహిళ పెద్దగా కేకలు వేయండతో ఆమెను ఆరాంఘర్ చౌరస్తా వద్ద దించేసి పారిపోయాడు. అనంతరం ఆటోలో వనస్థలిపురంలోని ఇంటికి వెళ్లిన బాధితురాలు.. షీ టీమ్స్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదుచేసింది. క్యాబ్‌ డ్రైవర్‌ వివరాలు తీసుకున్న షీటీమ్స్‌.. బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌కు, అటునుంచి కోర్టుకు  తరలించారు.

Comments

comments