Search
Wednesday 21 November 2018
  • :
  • :

గాయనిపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడి..!

Ola-Bil

బెంగళూరు : విధులు నిర్వహించుకొని క్యాబ్‌లో వస్తున్న గాయనిపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. సదరు గాయని రాత్రి 2.30 గంటల సమయంలో విధులు ముగించుకొని ఓలా క్యాబ్‌లో ఇంటికి బయలుదేరింది. క్యాబ్ కొంత దూరం వెళ్లిన తర్వాత తాను వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే దారిలో వెళ్లాడాన్ని ఓలా యాప్ ద్వారా ఆ యువతి గుర్తించింది. క్యాబ్‌ను ఓ నిర్జన ప్రదేశానికి డ్రైవర్ తీసుకెళ్లడంతో అనుమానం వచ్చిన యువతి అతనితో పోట్లాడి తప్పించుకొని సమీపంలోని మెడికల్ క్లినిక్ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తన స్నేహితుడికి ఫోన్ చేసింది. ఈ లోపు ఆ క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా ఈ ఘటన అనంతరం ఆ యువతి బొమ్మనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అదనపు పోలీస్ కమిషనర్ హేమంత్ నింబాల్కర్ తెలిపారు.

Comments

comments