Home హైదరాబాద్ ఎడారి దేశాలకు.. పుత్తడిబొమ్మలు!

ఎడారి దేశాలకు.. పుత్తడిబొమ్మలు!

ఎడారి దేశాల్లో పాతబస్తీవాసుల ఆక్రందనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి! పెళ్లిళ్లు, ఉద్యోగాల పేరుతో పుత్తడిబొమ్మలకు ఆశ చూపుతున్న ఏజెంట్లు అక్కడకు తీసుకెళ్లి అరబ్బులకు విక్రయిస్తున్నారు! వీరి మోసం గ్రహించేలోపే వారు అక్కడ బందీలవుతున్నారు! చేసేదిలేక దేశం కాని దేశంలో బానిసల్లా బతుకునీడుస్తున్నారు! అయితే.. పాతబస్తీలో మాత్రం ఈ విష సంస్కృతి దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది! దీనిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే వాదన వినిపిస్తోంది! ఫలితంగా రోజులో ఏదో ఒకచోట ఇలాంటి ఘటనే చోటుచేసుకుంటోంది! పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఒకరిద్దరూ అతికష్టం మీద స్వదేశానికి చేరుతున్నా.. కమీషన్ల కక్కుర్తికి అలవాటు పడిన ఏజెంట్లు మాత్రం పదుల సంఖ్యలో అమాయకులను ఎడారి చెరకు దర్జాగా సాగనంపుతున్నారు!

నిరుపేద కుటుంబాలకు ఏజెంట్ల ఎర
పెళ్లిళ్లు, ఉద్యోగాల పేరుతో అరబ్బులకు విక్రయం
వెళ్లిన కొద్దిరోజులకే నరకం చూస్తున్న బాధితులు
పాతబస్తీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న విష సంస్కృతి

             Gulf-Air

మన తెలంగాణ/సిటీబ్యూరో: దుబాయ్‌లో ఉండే ధనవంతులైన అరబ్బులకు పాత బస్తీకి చెందిన కొందరు ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. ఒక బాలికను పెళ్లి పేరుతో వారికి అప్పగిస్తే ఏజెం ట్లకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నజరా నా అందుతోంది. దీనికి ఆశపడిన ఏజెంట్లు తమ ప బ్బం గడుపుకునేందుకు పాతబస్తీలో పూటకు నోచుకో ని నిరుపేదలపై దృష్టి సారిస్తారు. రిక్షా కార్మికుడు, తో పుడు బండ్లు నడుపుకునేవారు, ఆటో డ్రైవర్లు, పంక్చర్ దుకాణం నడిపేవారు, చిన్నాచితక కూలీ పనులకు వె ళ్లే వారి కుటుంబాల వద్దకు ఏజెంట్లు వెళ్లి వారిని మచ్చిక చేసుకుంటారు. వారి కుటుంబంలో ఎవరైనా బాలిక ఉంటే దుబాయ్ షేక్‌కు ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె సుఖపడుతుందని, అక్కడి నుంచి పెద్ద మొత్తంలో మీ కు డబ్బులు పంపుతుందని మాయమాటలు చెప్పి వా రిని లొంగదీసుకుంటారు. తీరా అరబ్ షేక్‌ను పాత బస్తీకి రప్పించి రహస్యంగా పెళ్లి తతంగం ముగించి ఆ బాలికను దుబాయ్‌కు పంపిస్తారు. అక్కడికి వెళ్లాక బాధితులు చిత్రహింసలకు గురవుతుంటారు. ఈ క్ర మంలోనే రెండు రోజుల క్రితం పాతబస్తీలో ఓ బాలిక ఉదంతం తెరపైకి వచ్చింది.

నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన ఓ బాలిక ఫలక్‌నుమా ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోం ది. ఈ బాలికను గౌసియా బేగం అనే ఏజెంట్ దుబా య్‌కు చెందిన అరబ్‌షేక్ అహ్మద్ (65)తో వివాహం జరిపించి పంపించింది. ఆ బాలిక ఆరు నెలలుగా అ క్కడ నరకం అనుభవిస్తోంది. ఈ విషయం తెలుసుకు న్న తల్లిదండ్రులు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఈ కేసులో ఏజెంట్‌తో పాటు ఆమెకు స హకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశా రు. అయితే బాలిక మాత్రం ఇంకా దుబాయ్‌లోనే షేక్ చేతిలో బందీగా ఉంది. ఒక ఈ బాలికనే కాదు ఇలాంటి వారెందరో బాధితులు ఎడారి దేశాల్లో నర కం అనుభవిస్తున్నారు.

యువకులదీ నరకమే..

దుబాయ్‌లో అడవిలో ఒంటెలు, గొర్రెల బాగోగులు చూసుకునేందుకు పనిమనుషులు ఎక్కువగా ఆసక్తి క నబర్చరు. కిలోమీటర్ల చుట్టూ ఎక్కడ చూసినా అక్కడ మనిషి అనే వాడు కనిపించడు. జంతువుల మధ్య ఒం టరిగా గడపాల్సి ఉంటుంది. అయితే పాతబస్తీకి చెం దిన కొంతమంది ఏజెంట్లు నిరుద్యోగ యువకులకు గల్ఫ్ ఉద్యోగాల ఆశ చూపుతారు. నెలకు రూ.40 వేల జీతం, భోజనం, వసతి సౌకర్యం అన్ని ఉంటాయని న మ్మిస్తారు. షాపింగ్ సెంటర్‌లో వాచ్‌మెన్లని, కారు డ్రై వర్లని చెప్పి ఇక్కడి నుంచి అక్కడకు పంపిస్తారు. అక్క డకు చేరుకున్నాక ఆ యువకులను ఆడవిలో ఉండే ఒంటె, గొర్రెల యజమానులకు విక్రయిస్తారు. ఒకసా రి అక్కడి అడవిలో పడ్డారంటే ఇక బయట పడడం క త్తిమీద సాములాంటిదే. వారం రోజుల క్రితం ఇలాం టి ఘటనే ఒకటి వెలుగు చూసింది. -తలాబ్‌కట్టకు చెం దిన సయ్యద్ సాధిక్ (30)ను దుబాయ్‌లోని ఓ షాప్ లో హెల్పర్‌గా ఉద్యోగమని నమ్మించిన అర్షద్ అనే ఏజెంట్ గతేడాది జులైలో దుబాయ్‌కు పంపించాడు. అక్కడకు వెళ్లాక ఓ అరబ్ షేక్ అతడిని తీసుకెళ్లి అడవి లోని తన ఒంటెల షెడ్‌లో పెట్టేసాడు. ఏడాదిగా అత డు అక్కడే నరకం అనుభవిస్తున్నాడు. ఇటీవల తాను పడుతున్న బాధను ఓ భారతీయుడి సహాయంతో వీడి యో తీసి ఇక్కడి కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వా రా పంపించాడు. సదరు ఏజెంట్‌పై పాతబస్తీ పోలీసు లు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సాధిక్ దుబాయ్ లోనే షేక్‌ల చేతిలో బందీగా ఉన్నాడు. ఇలా పాతబ స్తీలో ఒక్క సాధిక్‌కే కాదు.. అలాంటి వారు ఎంతోమం ది అరబ్బుల చేతిలో చిత్రహింసలు పడుతున్నారు.

క్షేమంగా స్వదేశం చేరిన రుబీనా, సైరాబాను

ఫలక్‌నుమాకు చెందిన రుబీనాబేగం (36), శాలిబం డకు చెందిన సైరాబాను (23) వీరిద్దరూ ఏజెంట్ల చేతి లో మోసపోయి అరబ్ దేశంలో బానిస బతుకు గడిపి రెండ్రోజుల క్రితమే క్షేమంగా స్వదేశానికి చేరారు. ఎం బిటి నాయకుడు అమ్జదుల్లాఖాన్ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ సహకారంతో వీరిద్దరిని దుబా య్ నుంచి తీసుకొచ్చారు. ఇలాంటి మహిళలు, బాలి కలు దుబాయ్‌లో మరింత మంది ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పాతబస్తీలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆదుకో వాలని పలువురు కోరుతున్నారు. విదేశాలకు వెళ్లి మో సపోయామని బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నా పోలీసులు కేవలం కేసు నమోదు చేసుకుని చే తులు దులుపుకుంటున్నారు. లోతుగా దర్యాప్తు చేసి పాతబస్తీలో ఏజెంట్ల వ్యవస్థ నామరూపాల్లేకుండా చే యాలని కోరుతున్నారు.