Search
Thursday 20 September 2018
  • :
  • :

కూటి కోసం!…కోటి పాట్లు!!

Begging

కోరుట్ల రూరల్: పూట గడవాలని వీదుల్లో భిక్షాటనలు చేసుకుని పొట్ట పోసుకుంటున్నారు ముగ్గురు వృద్ద వికలాంగులు పట్టణంలోని పలు వీదులగుండ తీరుగుతూ మండుటెండల్లో పొర్లుకుంటు యాచిస్తూ వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. దారులపై భవతిబిక్షాం దేహీ అని గొంతెత్తి అరుస్తుంటే వారి భాదలు చూసిన వారు చిల్లర వేయక పది,ఇరవై,యాబై నోట్లను వారికి బిక్షంగ వేస్తున్నారు.

బాబు జగ్జీవన్‌రాం విగ్రహం ప్రాంతంలో వికలాంగులు పొర్లుతు యాచిస్తున తీరుని చూసిన చిన్నారులు చలించి తల్లిదండ్రుల వద్దకు వెల్లి చాక్లెట్లు కొనుక్కుంటామని చెప్పి ఆ డబ్బులను వికలాంగులకు వేస్తుంటే చిన్నారులను చూసి ఓహో అని మెచ్చుకుంటున్నారు. శరీరం సహకరించక బిక్షాటనలు చేస్తున్న వారి పట్ల చిన్నారుల దయాగుణానికి కన్నోళ్ళ కళ్ళల్లో నీళ్ళు కారుతుంటే చిరునవ్వులు చిందిస్తున్న లేత పసి హృదయాలకు సాటి మనుషుల పట్ల జాలి చూపే తత్వం ఉంటే ఆ చిన్నారులను కన్న తల్లి దండ్రులు అదృష్టవంతులేగా.

మహాత్ముడి చిత్ర పటంతో యాచనలు

హింస అనే పదాలకు చోటివ్వక శాంతి మార్గంలో తెల్లోడి పాలనలకు చమరగీతం పాడి దేశానికి స్వతంత్య్రం తెచ్చిన మహాత్మ గాంధీ చిత్ర పటంతో పట్టణంలోని టీచర్స్ క్లబ్ ప్రాంతంతో భిక్షాటన చేస్తున్న మరో వృద్దుడికి కేవలం ఒక్క గంట సమయంలో 3 వందల రూపాలను బిక్షంగా వేశారంటే మహాత్ముడుని మరువలేరనడానికి నిధర్శనంగా నిలుస్తున్నారు ఆ ప్రాంత జనాలు.

వృద్దునికు దుప్పట్ల పంపిణి చేసిన విలేకరులు

పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డుపై పడిఉండి, ఆచేతన స్థితిలో ఉన్న ఓ వృద్దుడిని చూసి చలించిన విలేకరులు 10 టీవి,మల్లిఖార్ఝున్,టీవి 9 నవీన్‌లతో పాటు విఆర్‌ఓ నిజాం,అల్లే శంకర్,కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి వైధ్యుడు మల్లిఖార్జున్‌లు ఆ వృద్దుడికి దుప్పట్లు,దోతి పంచలు అందించిండంతో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్,రంగారావు,శికారి రామకృష్ణ,గంగుల రాంగోపాల్,బలిజ రాజరెడ్డి,సూర్యనారాయణ,సాక్షి అంజు,ఐ న్యూస్ ప్రభాకర్,కట్కం గణేష్,రాజ్‌న్యూస్ ఆదిలతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు వారికి అభినందనలు తెలిపారు.

Comments

comments