Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

old man death in road accident

కరీంనగర్ క్రైం: కొత్తపల్లి మండలంలోని రేకుర్తి గ్రామ చౌరస్తా వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. కొత్తపల్లి ఎస్.ఐ స్వరూప్‌రాజ్ కథనం మేరకు… జిల్లా కేంద్రంలోని కాపువాడకు చెందిన బట్టు రాజమల్లయ్య (59) అనే వృద్ధుడు తన భార్య బట్టు లక్ష్మిని రేకుర్తి కంటి ఆసుపత్రిలో వైద్యపరీక్ష నిమిత్తం ఎపి15బిసి 8667 అనే నంబర్ గల ద్విచక్ర వాహనం మీద తీసుకుని వెళ్ళాడు. మార్గమధ్యంలో రేకుర్తి గ్రామం వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న టి.ఎస్ 16 యుఎ 9156 అనే నంబర్ గల లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజమల్లయ్య లారీ వెనకటైర్ కింద పడి శరీరం నుజ్జునుజ్జు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య లక్ష్మికి మాత్రం ఏలాంటి గాయాలు కాలేదు. శవ పంచనామా తరువాత పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్.ఐ స్వరూప్‌రాజ్ పేర్కొన్నారు.

Comments

comments