Home తాజా వార్తలు రైల్వే స్టేషన్ లో గోడ కూలి ఒకరు మృతి

రైల్వే స్టేషన్ లో గోడ కూలి ఒకరు మృతి

Railway-Station

పాట్నా: రైల్వే స్టేషన్ లో బాత్ రూమ్ గోడ కూలి ఒకరు మృతి చెందిన ఘటన బీహార్ లోని పాట్నాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ప్లాట్ ఫామ్ నెంబర్ వన్ లో సెకండ్ క్లాస్ పెయిటింగ్ రూమ్ వద్ద గోడ కూలిపోవడంతో 70 ఏళ్ల వృద్ధుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. నిర్మాణంలో లోపం వల్లే ఈ గోడ కూలిందని రైల్వే అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.