Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

వడదెబ్బతో ఆర్‌టిసి బస్సులో వృద్దుడి మృతి

Old-Man

బిజినేపల్లి: వడదెబ్బతో  ఆర్‌టిసి బస్సులో ప్రయాణిస్తూ ఓ వృద్దుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.  అచ్చంపేటకు చెందిన కె. అంబయ్య(70) అనే వృద్దుడు శుక్రవారం ఉదయం అచ్చంపేట డిపోకు చెందిన  ఆర్‌టిసి బస్సు ఏపి 29 జెడ్3412 అనేబస్సులో అచ్చంపేట నుండి భూత్పూరు మండలం అమిస్తాపూర్‌కు బయలుదేరాడు.  ఆర్‌టిసి బస్సులోని కిటికి పక్కన కూర్చొని ప్రయాణిస్తుండగా పాలెం డియంఅండ్ హెచ్‌ఓ కార్యాలయ సమీపంలో అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు అతన్ని లేపే ప్రయత్నం చేశారు.  వృద్దుడు అంతక ముందే మరణించాడు. దీంతో ప్రయాణికులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయటంతో అక్కడికి చేరుకున్న ఎస్సై ప్రదీప్ కుమార్ శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్ఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.

Comments

comments