Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆర్టీసి బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

Old Man Dies In Road Accident In Ghutkesar

ఘట్‌కేసర్ : రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మరణించిన సంఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం శామీర్‌పేట్ మండలం, మూడు చింతలపల్లి గ్రామానికి చెందిన రాఖేల శివసత్తయ్య యంనంపేట్ చౌరస్తవద్ద ప్రమాదానికి గురై మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో పికేట్ డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఢీ కొంది. దీంతో శివసత్తయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం బొల్లారంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments