Home కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

Old man in  road accident

కరీంనగర్ క్రైం: కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బైపాస్‌ రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందినట్టు సిఐ తులా శ్రీనివాస్‌రావు తెలిపారు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండి కాలనీకి చెందిన సత్యనారాయణ (63) అదే ప్రాంతానికి చెందిన బైరి చంద్రమౌళి అనే వ్యక్తులు ద్విచక్ర వాహనం మీద కరీంనగర్ నుండి ఎల్‌ఎండి కాలనీకి వెళ్తుండగా వెనక నుండి వచ్చిన లారీ డ్రైవర్ మోటార్‌ సైకిల్‌ను ఓవర్‌టెక్ చేసేందుకు ప్రయత్నిస్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ మృతి చెందగా చంద్రమౌళి గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి సత్యనారాయణ మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నీటిపారుదల శాఖలో వాచ్‌మెన్‌గా పనిచేసి రిటైర్డ్ అయినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు సిఐ వివరించారు.