Home జాతీయ వార్తలు బురదమట్టే … ఆయనకు అన్నం!

బురదమట్టే … ఆయనకు అన్నం!

MUD

జార్ఖండ్ : ఆయన పేరు కరు పాశ్వాన్. సాహెబ్‌గంజ్‌లో నివాసం ఉంటున్నాడు. అందరూ అన్నం , ఇతర పదార్ధాలు తింటే ఆయన మాత్రం బురదమట్టిని తింటాడు. ఆయన వయస్సు ఇప్పుడు వందేళ్లు. తాను నిరుపేద కుటుంబంలో పుట్టానని కరు పాశ్వాన్ తెలిపారు. తినడానికి తిండి దొరక్క 11 ఏళ్ల వయస్సు నుంచే బురద మట్టిని తినడం అలవాటు చేసుకున్నట్టు ఆయన చెప్పారు. పేదరికం కారణంగా బురదమట్టిని కొద్దికొద్దిగా తినేవాడినని, ఇప్పుడు అదే రోజువారి ఆహారంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కాలేదని ఆయన వెల్లడించారు.

Old Man is eating the Mud in Jharkhand