Home జాతీయ వార్తలు ఇద్దరు బాలికలపై వృద్ధుడి అత్యాచారం

ఇద్దరు బాలికలపై వృద్ధుడి అత్యాచారం

Rape

ఢిల్లీ : ఇద్దరు మైనర్ బాలికలపై ఓ వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఢిల్లీలోని పాలం ప్రాంతంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు మైనర్ బాలికలకు చాక్లెట్స్ ఆశ చూపి ఆ వృద్ధుడు ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాధిత బాలికలు కేకలు వేశాడు. దీంతో భయపడిన వృద్ధుడు చెరో ఐదు వేలు ఇచ్చి , జరిగిన ఘటనను ఎవరికీ చెప్పొద్దని ఆ బాలికలను బెదిరించాడు. బాలికలు నొప్పి బాధపడుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో వారు తమపై జరిగిన అత్యాచారం గురించి తల్లిదండ్రులకు చెప్పారు. బాధిత బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Old Man Raped Two  girls