Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పురుగుల మందు సేవించి వృద్ధుడి ఆత్మహత్య

Old man suicide by drake passion
జన్నారం: జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గంధం గంగన్న(82) అనే వృద్ధుడు శనివారం ఉదయం పురుగుల మందు సేవించి ఆతహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ తహిసోద్దీన్ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా గంగన్న కడుపు నొప్పి, మొకాల్ల నొప్పులతో బాధపడుతున్నాడని, అనేక ఆసుపత్రులు తిరిగిన ఆరోగ్యం నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది, ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు సేవించిన వృద్ధుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండ్డాడంతో హుటాహుటిన లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. వృద్దుని ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, విచారణ జరిపితే అసలు విషయాలు బయటపడే అవకాశం ఉందని, ఆ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు తెలిపారు. మృతుని కోడలు గంధం శంకరవ్వ, ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు జరుపుతున్నాట్టు ఎస్‌ఐ తహిసోద్దీన్ తెపారు.

Comments

comments