Home జాతీయ వార్తలు మోక్షం కోసం చెక్కను పెళ్లి చేసుకున్న తాత

మోక్షం కోసం చెక్కను పెళ్లి చేసుకున్న తాత

 

 

లక్నో: వివిధ మతాల వాళ్లు వివిధ రకాలుగా పెళ్లిలు చేసుకుంటారు. కొందరు ఆచారాల ప్రకారం… కుక్కను, గాడిదను, చెట్టును పెళ్లి చేసుకున్న సంఘటనలు ఎన్నో చూశాము.. తాజాగా ఓ వృద్ధుడు మాత్రం విచిత్రంగా చెక్కను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. కౌశింబి జల్లర్ అనే వృద్ధుడు (65) యుక్త వయస్సులో ఉన్నప్పుడు వివాహం చేసుకోలేదు. గతంలో వివాహం చేసుకోలేదని మోక్షం లభించకుండానే చనిపోతానేమోనని భయంతో కర్రను వివాహం చేసుకున్నాడు. చెక్కకు చీర కట్టి పెళ్లి కూతురుగా అతడి బంధువులు ముస్తాబు చేశారు.  బంధువులు, స్నేహితుల సమక్షంలో అంగరంగా వైభవంగా వేదమంత్రాల సాక్షిగా చెక్కను పెళ్లి చేసుకున్నాడు. అందరికీ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు. ఈ పెళ్లికి సంబందిచిన వార్త అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది.

 

Old Man want Marry Stick for Happy in Uttar Pradesh