Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

విషం చిమ్ముతున్న పాతటైర్ల కంపెనీలు

02MDPTC02 మెదక్ : ఆసియా ఖండంలోనే అత్యంత కాలుష్య ప్రాంతంగా పటాన్‌చెరు పారిశ్రామికవాడలు మారుతున్నాయి. ఇక్కడ ఉన్న రసాయన పరిశ్రమలతో ఇప్పటికే కాలుష్య ప్రాంతంగా ముద్ర ఉన్న పటాన్‌చెరు మరింత విషపూరితమైన కాలుష్య ప్రాంతంగా మారనుందంటే అవుననే చెప్పొచ్చు. పాతటైర్ల రూపంలో ఈ విషపూరిత గాలులు ఈ ప్రాంతాన్ని విషపూరితంగా మార్చనున్నాయి. మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో పాత టైర్లను కాల్చి అయిల్ తయారు చేసే పరిశ్రమలు పట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. టైర్లను అత్యధిక ఉష్ణోగ్రత వరకు వేడి చేయడంతో టైర్ల నుంచి ఆయిల్ వస్తుంది. ఇలా పాతటైర్లను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే ప్రక్రియలో టైర్ల నుంచి విషపూరితమైన గాలులు భయటకు వస్తున్నాయి. దాంతో పరిసరాలన్ని కలుషితమవుతున్నాయి. స్థానికంగా ఉన్న వారు ఈ గాలిని పీల్చుకోలేక పోతున్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న నల్లటి పొగ స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అనేక మంది శ్వాస సమస్యలతో ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారు.

02MDPTC01

Comments

comments