Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

లారీ ఢీ కొన్ని వృద్ధురాలు మృతి

Old woman dead in the larry accident in ITC EAST GETE
బూర్గంపాడు: లారీ ఢీ కొన్ని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని సారపాకలో గల ఐటిసి ఈస్ట్‌ గేటు సమీపంలో చోటు చేసుకుంది. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని సారపాక పంచాయితీలో గల గాంధీనగర్‌కి చెందిన ధారవత్ భద్రమ్మ(71) అనే వృద్ధురాలు గ్రామంలో బిచ్చం అడుకుంటు జీవించేది. ఈ క్రమంలో శనివారం సారపాకలో గల ఐటిసి ఈస్ట్‌ గేట్ సమీపంలో బిచ్చం అడుగుతున్న క్రమంలో ఐటిసి ఈస్ట్ గేట్‌లో నుంచి మణుగూరు వెళ్ళుత్తూన్న ఏపి20టీఏ 9355 నెంబర్ గల లారీ ఢీ కొన్నటంతో వృద్ధురాలు అక్కడికి అక్కడే మృతి చెందింది. స్ధానికుల ద్వారా సమాచారం తెలుకున్న పోలీస్‌లు సంఘటన స్ధలానికి చేరుకొని మృతి చెందిన ధారవత్ భద్రమ్మ మృత దేహానికి పోస్టుమట్టం నిమిత్తం బూర్గంపాడులోని ప్రభుత్వ హాస్పటల్‌కి తరలించారు. పోస్టుమట్టం అనంతరం మృత దేహాన్ని వృద్ధురాలి కొడుకు ధారవత్ భీక్యాకి అప్పగించారు. పోలిస్‌లు కేసు నమోదు చేసి దార్యప్తు చేసుస్తున్నారు.

Comments

comments