Home కామారెడ్డి కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి

కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి

dead body shift from dubai

నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గాలిపూర్‌లో కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి చెందిన విషయం బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి బయట నిద్రిస్తున్న వృద్ధురాలిపై కుక్కలు దాడి చేశాయి. వృద్ధురాలు తీవ్రగాయాలతో మృతి చెందడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు దుర్గవ్వ (80)గా గుర్తించారు.